హర్యానాలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె ....విద్యుత్ సరఫరాను ప్రైవేటీకరించడంపై ఆందోళన

హర్యానాలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె ....విద్యుత్ సరఫరాను ప్రైవేటీకరించడంపై ఆందోళన

న్యూఢిల్లీ: హర్యానాలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె కారణంగా గురుగ్రామ్, ఫరీదాబాద్, నుహ్ జిల్లాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇండస్ట్రియల్​ఏరియాల్లో దాదాపు 1,800 ఫ్యాక్టరీల్లో మూడు రోజులుగా ఉత్పత్తి ఆగిపోయింది. వాటిల్లో పనిచేసే డైలీ లేబర్  పనిలేక ఇబ్బందులు పడుతున్నారు.

 గురుగ్రామ్, నుహ్ ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దక్షిణ హర్యానా బిజ్లీ విత్రణ్ నిగమ్ కు చెందిన సుమారు 40 వేల మంది ఉద్యోగులు సమ్మెకు దిగారు. 

సమ్మె ప్రారంభమైన 12 గంటల్లోనే విద్యుత్ అంతరాయంపై మూడు వేల ఫిర్యాదులు అందినట్టు ఓ అధికారి తెలిపారు. గురుగ్రామ్‌‌‌‌‌‌‌‌లోని భీమ్‌‌‌‌‌‌‌‌గఢ్ ఖేరి ప్రాంతంలో బుధవారం రాత్రి నుంచి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో స్థానికులు  దౌలతాబాద్ ఫ్లైఓవర్‌‌‌‌‌‌‌‌పై బైఠాయించి రాస్తారోకో  చేశారు.