న్యూఢిల్లీ: ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు అత్యుత్తమ వినోదాన్ని అందించేందుకు టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ తాజాగా యూట్యూబ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉంటే.. ప్రకటనలు లేకుండా యాడ్ ఫ్రీగా యూట్యూబ్ వీడియోలు, షార్ట్స్ చూడవచ్చు.
వీటితో పాటు బ్యాక్‌గ్రౌండ్ ప్లే, ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్స్, యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం సదుపాయాలు లభిస్తాయి. ఇందుకోసం 28 రోజుల వ్యాలిడిటీ ఉండే రూ.200 ఓటీటీ ప్యాక్‌తో రీచార్జ్చేసుకోవాలి. దీంతో 30 జీబీ అదనపు డేటా కూడా వస్తుంది. ఈ ప్యాక్‌లో ఇప్పటికే ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5 ప్రీమియం, సోనీలివ్ సహా 18కి పైగా ఓటీటీ ప్లాట్‌ఫారాలు ఉన్నాయి.
