అక్టోబర్ 30న సోనీ లివ్ లోకి ఇమ్మోర్టల్ మూవీ..

అక్టోబర్ 30న సోనీ లివ్ లోకి ఇమ్మోర్టల్ మూవీ..

‘ది ప్యారడైజ్‌‌’ సినిమాతో ఇటీవల తెలుగు ప్రేక్షకులను పలకరించింది కయాదు లోహార్.  రీసెంట్‌‌గా ఈ మూవీ నెట్‌‌ ఫ్లిక్స్‌‌లో స్ట్రీమింగ్‌‌కు వచ్చింది. ఇక తను హీరోయిన్‌‌గా నటించిన మరో సినిమా కూడా ఓటీటీ స్ట్రీమింగ్‌‌కు రెడీ అయింది.  జీవీ ప్రకాష్ కుమార్‌‌‌‌కు జంటగా ఆమె నటించిన తమిళ చిత్రం ‘ఇమ్మోర్టల్‌‌’.  మారియప్పన్‌‌ చిన్నా డైరెక్ట్ చేసిన ఈ హారర్ థ్రిల్లర్‌‌‌‌ సోనీలివ్‌‌ ఓటీటీలో అక్టోబర్‌‌‌‌ 30 నుంచి స్ట్రీమింగ్‌‌ కాబోతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ,  మలయాళ,  హిందీ భాషల్లో అందుబాటులోకి వస్తోంది.  

హారర్ స్టోరీకి ఫాంటసీ ఎలిమెంట్స్‌‌ జోడించిన ఈ చిత్రంలో సింధు అనే పాత్రలో కయాదు నటించింది.  ఇక ఈ చిత్రం కథ విషయానికొస్తే.. ప్రింటింగ్‌‌  ప్రెస్‌‌లో పనిచేస్తూ తక్కువ అద్దెకు ఓ గది కోసం వెతుకుతున్న మ్యాగీ (జీవీ ప్రకాష్‌‌)కి సింధు పరిచయమై షేరింగ్ ఫ్లాట్‌‌ గురించి చెబుతుంది.  

రిచ్‌‌ అపార్ట్‌‌మెంట్‌‌ తక్కువ అద్దెకు రావడంతో ఆమెతో ఫ్లాట్ షేర్ చేసుకుంటాడు. అయితే ఆ తర్వాత జరిగే సంఘటనలు,  సింధు గురించి తెలిసిన రహస్యం అతన్ని కలవరపెడతాయి. అసలు సింధు ఎవరు.. ఆమె చుట్టూ ఉన్న రహస్యాలేమిటి అనేది మిగతా కథ.  శ్యామ్ సీఎస్‌‌ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.