హర్షవర్ధన్ రాణే హీరోగా నటిస్తున్న చిత్రం ‘సిలా’. ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో జీ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఇదొక రొమాంటిక్ యాక్షన్ డ్రామా. శుక్రవారం ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడంతో పాటు మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్టు తెలియజేశారు.
ఇక ఫస్ట్ లుక్ పోస్టర్‌లో హీరో హర్షవర్ధన్ రాణే లుక్ ఆకట్టుకుంది. ‘విధినే దాటిన ప్రేమ.. హద్దులు లేని ప్రయాణం.. ఊహకందని కథ.. ‘సిలా’ కోసం అతని అన్వేషణ మొదలైంది’ అని క్యాప్షన్ ఇచ్చారు. లవ్ అండ్ రివేంజ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రంలో హర్షవర్ధన్ రాణే సరసన ‘షికారా’ ఫేమ్ సాదియా ఖతీబ్ హీరోయిన్‌గా నటిస్తోంది. కరణ్‌వీర్ మెహ్రా, ఇప్సిత కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాశ్మీర్, వియత్నాంలోని అందమైన లొకేషన్స్‌లో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు.
