భయపెడుతూ నవ్వించే మిస్టర్ దెయ్యం

భయపెడుతూ నవ్వించే మిస్టర్ దెయ్యం

విజయ్ శంకర్, సిరి చౌదరి, ఖయ్యూమ్ ప్రధాన పాత్రల్లో సంజన అన్నే దర్శకత్వంలో రూపొందుతున్న  చిత్రం ‘మిస్టర్ దెయ్యం’. వెంకట్ నిమ్మలపూడి, సింధు అన్నే నిర్మిస్తున్నారు. శుక్రవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని  ప్రారంభించారు. ముహూర్తపు షాట్‌‌‌‌కు హీరో మంచు మనోజ్ క్లాప్ కొట్టగా,   అలీ కెమెరా స్విచాన్ చేశారు. దర్శకులు  విజయ్ కనకమేడల ఫస్ట్ షాట్‌‌‌‌కి  డైరెక్షన్ చేయగా,  వీఎన్ ఆదిత్య, ఆర్పీ పట్నాయక్ మేకర్స్‌‌‌‌కు  స్క్రిప్ట్ అందజేశారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో నటీనటులు మాట్లాడుతూ  ‘ఈ చిత్రం హారర్ ఎలిమెంట్స్‌‌‌‌తో కూడిన  అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్. అందరినీ భయపెడుతూ, నవ్విస్తుంది.  ఇదివరకెన్నడూ చూడనటువంటి బెస్ట్ ఎక్స్‌‌‌‌పీరియన్స్ ఇస్తుంది’ అని అన్నారు.  నవంబర్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తామని, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని దర్శక నిర్మాతలు తెలియజేశారు.