అన్ని ప్రాంతాలకు నచ్చే మన ఇంటి కథ ఇడుపు కాయితం..

అన్ని ప్రాంతాలకు నచ్చే మన ఇంటి కథ ఇడుపు కాయితం..

ప్రియదర్శి హీరోగా తెలంగాణ ఫోక్ సింగర్ నాగదుర్గ హీరోయిన్‌‌‌‌గా సుకుమార్ రైటింగ్స్, బన్నీవాస్ వర్క్స్ బ్యానర్లపై  వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఇడుపు కాయితం’.  ఇప్పటికే విడుదలైన మొదటి పాటకు మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా సెకండ్ సాంగ్‌‌‌‌తోపాటు ఈ మూవీ రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. డిసెంబర్ 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.  ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో  ప్రియదర్శి మాట్లాడుతూ  ‘ఈ  సినిమా ప్రారంభమైన మొదట్లో   సోషల్ మీడియాలో  చాలామంది నెగెటివ్‌‌‌‌గా  స్పందించారు. 

సబ్ టైటిల్స్ వేస్తారా, తెలుగులో డబ్ చేస్తారా అని కామెంట్స్ చేశారు. ఆ టైమ్‌‌‌‌లో మేము తప్పు చేస్తున్నామా అని అనిపించింది. కానీ ఇండస్ట్రీ నుంచి చాలామంది సపోర్ట్ చేయడంతో మాలో  పాజిటివిటీ పెరిగింది.  ఏ ప్రాంతమైనా ఏ భాష అయినా  అందరికీ నచ్చేలా ఈ సినిమా ఉంటుంది. ఇక ‘గడప’ సాంగ్ విషయానికొస్తే..  మా అమ్మ తన ఇంటి గడప దాటి మా ఇంటికి వచ్చింది. అలాగే నా సోదరి, నా భార్య.. ఇలా మన ఇంటిలో గడప గురించి చాలా జ్ఞాపకాలు ఉంటాయి. 

అలాంటి గడపను సెలబ్రేట్ చేసే పాట ఇది’ అని చెప్పాడు.  ప్రాంతీయ భేదం లేకుండా తన పాత్రను అందరూ  ఇష్టపడతారు అని నాగదుర్గ చెప్పింది. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే చిత్రమిది అని డైరెక్టర్ వంశీరెడ్డి అన్నాడు. ప్రొడ్యూసర్ బన్నీవాస్ మాట్లాడుతూ  ‘కొత్తగా పెళ్లయిన ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మన ఇంటికథగా ఈ సినిమా ఉండబోతోంది. కథతోపాటు ఇందులోని  మాటలు, పాటలు అన్నీ చాలా నేచురల్‌‌‌‌గా ఉంటాయి.  

కొత్త జంటలు  పెళ్లైన కొత్తలో ఈ  సినిమా చూస్తే  ఇంకెప్పుడు ఇడుపు కాయితం గురించి ఆలోచించరు’ అని అన్నారు. నటులు అభినవ్ గోమటం,  వినోద్ బాల, మైమ్ మధు, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, లిరిసిస్టులు అలరాజు, అభినయ శ్రీనివాస్,  సింగర్స్ తేలు విజయ, శంకర్ బాబు  పాల్గొన్నారు.