రుక్మిణీ వసంత్ కొత్త మూవీ అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్... 

రుక్మిణీ వసంత్ కొత్త మూవీ అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్... 

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న కన్నడ హీరోయిన్‌‌‌‌ రుక్మిణీ వసంత్.. తాజాగా ఓ లేడీ ఓరియెంటెడ్‌‌‌‌ సినిమాకు సైన్ చేసింది. శర్వానంద్ హీరోగా ‘ఒకే ఒక జీవితం’ తీసిన శ్రీకార్తిక్ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతోంది.  ఇందులో దేవ్ రామనాథ్, వినాయక్ వైద్యనాథన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రుక్మిణీ అండ్ ఫ్రెండ్స్‌‌‌‌ పేరుతో శుక్రవారం అనౌన్స్‌‌‌‌మెంట్ వీడియో విడుదల చేశారు.  డైరెక్టర్, దేవ్ రామనాథ్, వినాయక్ కలిసి రుక్మిణీ వసంత్‌‌‌‌కు కథ చెప్పడానికి వెళ్లడం, ఆమె స్టోరీ విన్నాక ఓకే చెప్పడం లాంటివి ఈ వీడియోలో చూపించారు.  

ఫొటో కెమెరాను నిక్కీ అనే ఫన్నీ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌గా ప్రజెంట్ చేయడంతో పాటు వీడియో చివర్లో ఇందులో రుక్మిణీ వసంత్ ‘తార’ అనే పాత్ర  పోషిస్తున్నట్టు రివీల్ చేశారు. రోడ్ ట్రిప్‌‌‌‌ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో అడ్వెంచరస్‌‌‌‌ కామెడీతో ఈ సినిమా ఉండబోతోందని అర్థమవుతోంది.  దర్శకుడు శ్రీ కార్తిక్‌‌‌‌తో కలిసి దేవ్ రామనాథ్,  జస్వంత్ నడిపల్లి నిర్మిస్తున్నారు. సాయికృష్ణ గద్వాల కో ప్రొడ్యూసర్.  త్వరలో టైటిల్‌‌‌‌,  షూటింగ్‌‌‌‌ అప్‌‌‌‌డేట్స్‌‌‌‌ వెల్లడించనున్నారు.  

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌కు జంటగా ‘డ్రాగన్‌‌‌‌’లో నటిస్తోంది రుక్మిణీ వసంత్. వచ్చే ఏడాది జూన్‌‌‌‌లో ఇది విడుదల కానుంది. మరోవైపు నివీన్‌‌‌‌ పౌలీతో కలిసి ఓ మలయాళ చిత్రంలో నటిస్తోంది. అలాగే మాలాశ్రీతో కలిసి ఆమె నటించిన కన్నడ చిత్రం ‘మంగళ గౌరి’ రిలీజ్‌‌‌‌కు రెడీ అవుతోంది.