హైదరాబాద్, వెలుగు: ఫుట్‌వేర్ ఫ్యాషన్ బ్రాండ్ నీమన్స్ విస్తరణకు రెడీ అయింది. హైదరాబాద్ పంజాగుట్టలో తమ 50వ ఎక్స్‌క్లూజివ్ రిటైల్ స్టోర్‌ను శుక్రవారం ప్రారంభించింది. రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 500 స్టోర్లకు విస్తరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. 2023లో ఆఫ్‌లైన్ రిటైల్ ప్రయాణం ప్రారంభించిన ఈ సంస్థకు పశ్చిమ, దక్షిణ భారతదేశంలోనే 70 శాతం స్టోర్లు ఉన్నాయి. ఈ 50వ స్టోర్ మైలురాయికి గుర్తుగా అమ్మకానికి కాకుండా కేవలం ప్రదర్శన కోసం 10 ప్రత్యేక ఎడిషన్ షూ జతలను నీమన్స్ రూపొందించింది. ఇక్కడ పురుషులు, మహిళల కోసం స్నీకర్లు, వాకింగ్ షూస్, స్లిప్ ఆన్స్, స్లిప్పర్లు, శాండల్స్, ఫ్లిప్ ఫ్లాప్స్ లభిస్తాయని నీమన్స్ తెలిపింది.
