దసరా పండుగల సీజన్ ముగియగానే బంగారం, వెండి రేట్లు రోజురోజుకూ భేజారుతున్నాయి. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు వంటి కారణాలు బులియన్ మార్కెట్లను మసకబారుస్తున్నాయి. ఈ క్రమంలోనే శనివారం రోజున గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు బ్రేక్ తీసుకుని నిలకడగా ఉన్నాయి. దీనిని సధ్వినియోగం చేసుకుందాం షాపింగ్ చేద్దాం అనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరంలోని ధరలను పరిశీలించాలి.
అక్టోబర్ 24న బంగారం రేట్లు స్వల్పంగా పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.10 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 258గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 070గా కొనసాగుతోంది.
శనివారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. అక్టోబర్ 24, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీ రూ.2లక్షల 20వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.220 దగ్గర ఉంది.
