వడోదరా: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న ఇండియా విమెన్స్ జట్టు.. జింబాబ్వేతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బోణీ చేసింది. టార్గెట్ ఛేజింగ్‌లో ప్రతీక రావల్ (96 బాల్స్‌లో 15 ఫోర్లతో 100 నాటౌట్) సెంచరీ చేయడంతో.. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఇండియా 9 వికెట్ల తేడాతో గెలిచింది. దాంతో సిరీస్‌లో 1–0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచిన జింబాబ్వే 49.5 ఓవర్లలో 197 రన్స్‌కు ఆలౌటైంది. బిలవ్డ్ బిజా (62), మోడెస్టర్ ముపాచిక్వా (25), తిరిపానో (21), మిచెల్లి మువంగ (29) రాణించారు.
ఇండియా బౌలర్లు శ్రీచరణి (4/23), క్రాంతి గౌడ్ (3/42), దీప్తి శర్మ (2/44) వరుస విరామాల్లో వికెట్లు తీసి జింబాబ్వేను కట్టడి చేశారు. తర్వాత ఇండియా 27.1 ఓవర్లలో 200/1 స్కోరు చేసింది. స్టార్టింగ్ నుంచి దూకుడుగా ఆడిన ప్రతీక.. స్మృతి మంధాన (32)తో తొలి వికెట్‌కు 94, షెఫాలీ వర్మ (64 నాటౌట్)తో రెండో వికెట్‌కు 106 రన్స్ జోడించి ఈజీగా గెలిపించారు. ప్రతీకాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
