మెన్స్‌‌‌‌ పారా ఆర్చరీ రికర్వ్‌‌‌‌లో.. హర్విందర్‌‌‌‌ సింగ్‌‌‌‌–విజయ్‌‌‌‌ జోడీకి స్వర్ణ పతకం

మెన్స్‌‌‌‌ పారా ఆర్చరీ రికర్వ్‌‌‌‌లో..  హర్విందర్‌‌‌‌ సింగ్‌‌‌‌–విజయ్‌‌‌‌ జోడీకి స్వర్ణ పతకం

నగోయా: మెన్స్‌‌‌‌ పారా ఆర్చరీ రికర్వ్‌‌‌‌లో హర్విందర్‌‌‌‌ సింగ్‌‌‌‌–విజయ్‌‌‌‌ జోడీ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్లో ఇండియా ద్వయం 5–1తో యున్‌‌‌‌ డువో–జావో లిక్సుయ్‌‌‌‌ (చైనా)పై గెలిచింది. తొలి సెట్‌‌‌‌లో ఇరుజట్లు చెరో 35 పాయింట్లు సాధించడంతో డ్రా అయ్యింది. తర్వాత పుంజుకున్న ఇండియన్‌‌‌‌ జోడీ రెండో సెట్‌‌‌‌ను 37–36, మూడో సెట్‌‌‌‌ను 38–36తో గెలుచుకుంది. దాంతో 5–1 సెట్‌‌‌‌ పాయింట్లతో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచింది. విమెన్స్ డబుల్స్‌‌‌‌ ఫైనల్లో భావనా చౌదరి–పూజా జాత్యన్‌‌‌‌ 0–6తో గావో జిహాన్‌‌‌‌–వాంగ్‌‌‌‌ జుక్వియాన్‌‌‌‌ (చైనా) చేతిలో ఓడి సిల్వర్‌‌‌‌తో సంతృప్తి పడ్డారు. ఇండియన్‌‌‌‌ ఆర్చర్లు వరుసగా 31, 30, 29 పాయింట్లకే పరిమితం కాగా, చైనీస్‌‌‌‌ ఆర్చర్లు 38, 35, 39 పాయింట్లు  సాధించారు. 

పతకాల పట్టిక టాప్​–​ 5

దేశం    స్వర్ణం    రజతం    కాంస్యం    మొత్తం
చైనా    204    115    108    427
జపాన్​    63    60    62    185
ఉజ్బెకిస్తాన్​    45    49    51    145
ఇండియా    30    35    49    114
కొరియా    28    36    33    97