త్వరలోనే రాజమౌళి హాలీవుడ్ ఎంట్రీ..!

త్వరలోనే రాజమౌళి హాలీవుడ్ ఎంట్రీ..!

తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన దర్శకధీరుడు రాజమౌళి.. త్వరలో హాలీవుడ్‌‌‌‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.  బ్రెజిల్‌‌‌‌లో నిర్వహించిన 50వ సావో పాలో ఇంటర్నేషనల్‌‌‌‌ ఫిల్మ్ ఫెస్టివల్‌‌‌‌లో పాల్గొన్న రాజమౌళి.. తనకు హాలీవుడ్‌‌‌‌ నుంచి వచ్చిన ఆఫర్స్‌‌‌‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విజయం తర్వాత తనకు హాలీవుడ్ నుంచి పలు ఆఫర్లు వచ్చాయని చెప్పిన ఆయన..  అక్కడ కనీసం ఒక్క సినిమానైనా డైరెక్ట్ చేయాలన్నది తన డ్రీమ్ అని వెల్లడించారు.  

‘నాకు హాలీవుడ్‌‌‌‌ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి. అక్కడి వర్కింగ్ స్టైల్‌‌‌‌, సినిమా మేకింగ్‌‌‌‌ అద్భుతంగా ఉంటుంది. అక్కడ నేను నేర్చుకోవాల్సింది చాలాఉంది.  అందుకు ఒక్క సినిమా అయినా అక్కడ చేయాలనుకుంటున్నా’ అని చెప్పారు.  ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత హాలీవుడ్‌‌‌‌ ఆఫర్స్‌‌‌‌ రావడం,  అప్పటికే ‘వారణాసి’ ప్రీ ప్రొడక్షన్‌‌‌‌ వర్క్స్‌‌‌‌ మొదలవడంతో కుదరలేదని చెప్పారు.  

ఇది పూర్తయ్యాక హాలీవుడ్ ఆఫర్స్‌‌‌‌ గురించి కచ్చితంగా ఆలోచిస్తానని ఆయన అన్నారు. ఇక మహేష్ బాబు, ప్రియాంక చోప్రా లీడ్ రోల్స్‌‌‌‌లో తను తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ షూటింగ్ మరో 1‌‌‌‌‌‌‌‌0 రోజులు మాత్రమే బ్యాలెన్స్‌‌‌‌ ఉందని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు.  వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.