వర్షాల్లేవు..ఎండిపోతున్న పత్తి పంట..ఎకరానికి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు

వర్షాల్లేవు..ఎండిపోతున్న పత్తి పంట..ఎకరానికి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు
  • వర్షాభావం, భూమిలో తేమ లేక వాడిపోతున్న పత్తి చేనులు

​నేరడిగొండ, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో ఎల్ నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడంతో చేతికందే దశకు వచ్చిన పత్తి పంట కండ్లముందే ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ ఏడాది ఎకరానికి రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టి పంటను సాగు చేశారు. పంట ప్రారంభంలో అనుకూలంగా ఉన్నప్పటికీ, తర్వాతి కాలంలో వర్షాభావం కారణంగా దెబ్బతిన్నది. భూమిలో తగినంత తేమ లేక పత్తి కాయలు పరిమాణం పెరగకుండానే ఎండిపోవడంతో పాటు పూత, పిందెలు రాలిపోయి దిగుబడి సగానికి పైగా పడిపోయింది,

 పెట్టిన పెట్టుబడులు కూడా దక్కక, అప్పులు ఎలా తీర్చాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండిపోయిన పంటలను పరిశీలించి ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందేలా చూడాలని కోరుతున్నారు.