- అప్పటివరకు ఆడించి వాష్‌రూంకు వెళ్లిన పిన్ని
- వచ్చేలోపు దారుణం సూరారం పరిధిలో విషాదం
కుత్బుల్లాపూర్, వెలుగు : ఊర్లో పని ఉండడంతో ఏడాదిన్నర కూతురిని పదేండ్ల చెల్లెలి దగ్గర వదిలి భర్తతో ఊరెళ్లింది అక్క.. అక్క బిడ్డను ఓ కంట కనిపెట్టుకుని ఉన్న ఆ పాప..అప్పుడే వాష్‌రూంకు వెళ్లింది. అంతలోనే...ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి నీళ్లు నింపిన బకెట్లో పడి కన్నుమూసింది. ఈ హృదయవిదారక ఘటన సూరారం పోలీస్‌స్టేషన్‌పరిధిలో జరిగింది. బిహార్‌కు చెందిన పప్పూ రవిదాస్ కు ఇద్దరు కూతుళ్లు..భార్య చనిపోయింది.
కొన్నేండ్ల కింద సూరారం పాండుబస్తీకి వచ్చి కూలీ పనులు చేసుకుంటున్నాడు. పెద్ద కూతురు రాణీదేవికి పెండ్లయి ఏడాదిన్నర కూతురు దివాంశి కుమారి ఉంది. రవిదాస్, ఇతడి పెద్దకూతురు, అల్లుడు, పదేండ్ల చిన్నకూతురు చాందినికుమారి, మనవరాలు అందరూ పాండుబస్తీలోని ఒకే ఇంట్లో ఉంటున్నారు. బిహార్‌లో పని ఉండడంతో రాణీదేవి తన కూతురిని చెల్లెలు చాందినికుమారి వద్ద వదిలి వెళ్లింది. గురువారం తాత రవిదాస్కూలీకి వెళ్లాడు.
చాందిని తన అక్క కూతురు దివాంశి కుమారిని ఆడిస్తోంది. సాయంత్రం 4.30గంటల ప్రాంతంలో చాందిని కుమారి వాష్‌రూమ్‌కి వెళ్లింది. నీటి సమస్య ఉండడంతో బకెట్లలో నీళ్లు నింపి పెట్టుకున్నారు. అదే టైంలో దివాంశి ఆడుకుంటూ వెళ్లి బకెట్లో పడిపోయింది. వాష్‌రూమ్ నుంచి బయటకు వచ్చిన చాందిని గమనించి కేకలు వేయడంతో చుట్టుపక్కవారు వచ్చి దవాఖానకు తరలిస్తుండగా కన్నుమూసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ బాలరాజు తెలిపారు.
