ప్రభాస్ ఫ్యాన్స్‌‌‌‌ కు బర్త్‌‌‌‌డే ట్రీట్.. కల్కి2, సలార్2 మూవీల నుంచి క్రేజీ అప్ డేట్స్..

ప్రభాస్ ఫ్యాన్స్‌‌‌‌ కు బర్త్‌‌‌‌డే ట్రీట్.. కల్కి2, సలార్2 మూవీల నుంచి క్రేజీ అప్ డేట్స్..

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఫ్యాన్స్‌‌‌‌కు  అదిరిపోయే అప్‌‌‌‌డేట్స్ అందాయి. ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేసిన ఆయన,  ఇప్పుడు రెండు భారీ సీక్వెల్స్‌‌‌‌లో నటిస్తున్నాడు.  కల్కి2, సలార్2 చిత్రాలకు సంబంధించిన క్రేజీ అప్‌‌‌‌డేట్స్‌‌‌‌తో అభిమానుల్లో ఉత్సాహాన్ని  నింపారు.   నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ నుంచి స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు.  ఇందులో భైరవగా ప్రభాస్ సెట్స్‌‌‌‌లోకి అడుగుపెట్టిన క్షణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. షూటింగ్ కోసం మూవీ టీమ్ చేస్తున్న ఏర్పాట్లు,  దర్శకుడు యాక్షన్ చెప్పగానే కెమెరా ముందుకు వచ్చిన ప్రభాస్ విజువల్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.  

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా,  వైజయంతీ మూవీస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై అశ్వినీదత్ భారీ బడ్జెట్‌‌‌‌తో నిర్మిస్తున్నారు.   మరోవైపు, ‘సలార్: పార్ట్ 1 – సీజ్‌‌‌‌ఫైర్’తో సూపర్ సక్సెస్  అందుకున్న ప్రభాస్, ప్రశాంత్ నీల్ మరోసారి ‘సలార్ 2’ కోసం కలుస్తున్నారు.   ప్రతిష్టాత్మక హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సీక్వెల్ ప్రీ -ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ప్రభాస్ బర్త్‌‌‌‌డే సందర్భంగా అప్‌‌‌‌డేట్ అందించాడు ప్రశాంత్ నీల్.  

ప్రస్తుతం ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌తో తీస్తున్న  ‘డ్రాగన్’ సినిమా పూర్తయిన వెంటనే ‘సలార్2’ను స్టార్ట్ చేసేలా సన్నాహాలు చేస్తున్నట్టు తెలియజేశారు. ఇదిలా ఉంటే ప్రభాస్ నటిస్తున్న మరో క్రేజీయెస్ట్ మూవీ ‘ఫౌజీ’ నుంచి స్పెషల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌తో ఆయనకు బర్త్‌‌‌‌డే విషెస్ తెలియజేసింది టీమ్.  ప్రభాస్‌‌‌‌ను మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1933 అంటూ రివీల్ చేసిన పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. హనురాఘవపూడి రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇక ప్రభాస్‌‌‌‌తో ‘స్పిరిట్‌‌‌‌’ తెరకెక్కిస్తున్న  సందీప్ రెడ్డి వంగా.. ఓ స్పెషల్ ఫొటోతో ప్రభాస్‌‌‌‌కు బర్త్ డే విషెస్‌‌‌‌ తెలియజేశాడు.