ఆదర్శ కుటుంబంలో బ్లాక్ కామెడీ ట్రై చేశాం

ఆదర్శ కుటుంబంలో బ్లాక్ కామెడీ ట్రై చేశాం

వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్  దర్శకత్వంలో  రూపొందిన  ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ (ఏకే 47). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై   ఎస్. రాధాకృష్ణ (చినబాబు)  నిర్మించారు. అక్టోబర్ 30న సినిమా విడుదల కానుంది. శుక్రవారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. కామెడీ విత్ యాక్షన్‌‌‌‌తో కట్ చేసిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ‘మా మిడిల్ క్లాస్ వాళ్ల దగ్గర ఏం ఉంటది అన్న.. అమ్మడానికి ఆస్తి ఉండదు, కొనడానికి డబ్బులు ఉండవు, లేదని ఒప్పుకోవడానికి మొహమాటం, ఉందని చెప్పుకోవడానికి పరువు తప్ప..’ అని వెంకటేష్  చెప్పే డైలాగ్ ప్రతి మధ్యతరగతి వ్యక్తికి కనెక్ట్ అయ్యేలా  ఉంటుంది.  

తనదైన కామెడీ టైమింగ్‌‌‌‌, ఆకట్టుకునే స్క్రీన్‌‌‌‌ ప్రెజెన్స్‌‌‌‌తో వెంకీ ఆకట్టుకున్నారు.  ఇక ట్రైలర్‌‌‌‌‌‌‌‌ లాంచ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో  వెంకటేష్​ మాట్లాడుతూ ‘ట్రైలర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా.  కాలేజ్ లైఫ్‌‌‌‌లో నాకు ఎన్నో  మెమొరీస్ ఉన్నాయి.   ఆ రోజులు మళ్ళీ రావు. విద్యార్థులు తమ కలను నిజం చేసుకోండి.  కాలేజ్ అంటే డిగ్రీ, జాబ్ మాత్రమే కాదు.. మంచి క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌తో బయటకు రావాలి. మా  సినిమా చూసి అందరూ  ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా’ అని  అన్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘ఇది  అందరూ  ఊహించిన పద్ధతిలో కాకుండా, వేరే డైరెక్షన్‌‌‌‌లో ఉండే అవకాశమున్న సినిమా ఇది.  నార్మల్ రొమాంటిక్ కామెడీ కాకుండా వేరే అంశాలను కూడా డిస్కస్ చేశాం.  క్రైమ్ కామెడీ,  బ్లాక్ కామెడీ లాంటివి ట్రై చేశాం.  నాకు, వెంకటేష్ గారికి కూడా ఇది ఫస్ట్ అటెంప్ట్. 

పని చేసేటప్పుడు ఈ సినిమా మా అందరికీ ఇంటరెస్టింగ్‌‌‌‌గా అనిపించింది’ అని చెప్పారు.  ఈ సినిమాలో ప్రతి సీన్‌‌‌‌కు ఓ సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ ఉంటుందని హీరోయిన్ శ్రీనిధి శెట్టి చెప్పింది. ఈ చిత్రం తనకు చాలా ప్రత్యేకమైనది అని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అన్నాడు.  బాల నటుడు రాజ్ ప్రజ్వల్, యువినా  కార్యక్రమంలో  పాల్గొన్నారు.