జ్యోతినగర్, వెలుగు: రామగుండంలోని ఎన్టీపీసీ తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు 2026 కు ప్రతిష్ఠాత్మకమైన సేఫ్టీ ఇన్నోవేషన్ అవార్డు-లభించింది. న్యూఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన 23వ అంతర్జాతీయ భద్రతా సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేశారు. ఎన్టీపీసీ తెలంగాణ తరఫున ఏజీఎం (ఈఎండీ) రాజ్నిష్ చంద్ర సన్యాల్, సీనియర్ మేనేజర్ (సేఫ్టీ) ఏవీఎన్ రెడ్డి అవార్డును అందుకున్నారు.
విద్యుత్ ఉత్పత్తి కార్యకలాపాల్లో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం, వినూత్న భద్రతా విధానాలను అమలు చేయడం, ఉద్యోగుల్లో భద్రతా సంస్కృతిని ప్రోత్సహించడం వంటి అంశాలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఈ పురస్కారం ఎన్టీపీసీ తెలంగాణకు గర్వకారణమని, ‘భద్రతే ప్రథమ ప్రాధాన్యత, ఎల్లప్పుడూ, ప్రతిచోటా’ అనే నినాదానికి సంస్థ కట్టుబడి ఉందని ప్రతినిధులు పేర్కొన్నారు.
