- మెయింటనెన్స్ లోపమేనా?
కొడంగల్, వెలుగు: వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని 33/11 కేవీ సబ్ స్టేషన్లో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఓవర్‌లోడ్ కారణంగా సబ్ స్టేషన్‌లోని 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగాయని అధికారులు చెప్తున్నారు. ఫైర్ స్టేషన్‌కు సమాచారమివ్వడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. కాలిపోయిన 8 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ రూ. 50లక్షల విలువ ఉంటుందని సమాచారం. ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ పేలి ఉంటే సబ్‌స్టేషన్ చుట్టూ ఉండే ఇండ్లు ధ్వంసమై భారీ ప్రాణనష్టం జరిగేదని అక్కడున్నవారు తెలిపారు.
కారణమేంటి?
గతంలో 70 శాతం విద్యుత్ వినియోగం ఉండగా, ఎల్‌నినోతో 90 శాతానికి చేరిందని విద్యుత్‌శాఖాధికారులు చెప్తున్నారు. దీంతో లోడ్ పెరిగి ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందంటున్నారు. అయితే, మెయింటనెన్స్ లోపం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తున్నది.
కొడంగల్‌లో 24 గంటలు కరెంట్ సరఫరా చేస్తుండగా, ఓవర్‌లోడ్ పడే అవకాశం తక్కువగానే ఉంటుందంటున్నారు. ట్రాన్స్ఫార్మర్నిర్వహణ సరిగ్గా లేకనే ప్రమాదం జరిగి ఉండవచ్చంటున్నారు. కాగా, కొడంగల్‌లో త్వరలోనే కొత్త సబ్ స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు సమాచారం.
