జనగామ జిల్లా : రైతు అనుమానాస్పద మృతి..ఎలుగుబంటి దాడిలో చనిపోయినట్లు అనుమానం

జనగామ జిల్లా : రైతు అనుమానాస్పద మృతి..ఎలుగుబంటి దాడిలో చనిపోయినట్లు అనుమానం
  • బచ్చన్నపేట మండలం కొడవాటూర్ లో ఘటన 

​రఘునాథపల్లి, ​(జనగామ) వెలుగు : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవాటూర్ గ్రామంలోని ఓ రైతు శుక్రవారం అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  గ్రామానికి చెందిన రైతు మిన్నాలపురం సిద్ధయ్య (60) శుక్రవారం తెల్లవారుజామున గేదెలకు పాలు పిండేందుకు ఆలింపూరం రోడ్డులోని తన పొలానికి సైకిల్‌‌‌‌ పై వెళ్లాడు. 

వెంటనే తిరిగి రాకపోవడంతో ఆయన భార్య ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో పక్కింటి నరేశ్​ను పొలం వద్దకు పంపించింది. పొలంలో సిద్ధయ్య తలకు బలమైన గాయలతో కిందపడి ఉన్నాడు. వెంటనే అతడిని గ్రామస్తులు జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కొద్దిసేపటికే చనిపోయాడు. కాగా, సిద్ధయ్యపై ఎవరైనా దాడి చేశారా? ఎలుగుబంటి గానీ, ఇతర జంతువులు గానీ దాడి చేసి ఉంటాయా? అనే కోణంలో ఫారెస్ట్ అధికారులు, పోలీసులు విచారణ చేపడుతున్నారు.