తాజ్ జీవీకే పేరు మారింది.. ఇక నుంచి కృష్ణ జీవీకే లగ్జరీ హోటల్స్‌‌‌‌ 

తాజ్ జీవీకే పేరు మారింది.. ఇక నుంచి కృష్ణ జీవీకే లగ్జరీ హోటల్స్‌‌‌‌ 

న్యూఢిల్లీ: తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ తన పేరును కృష్ణ జీవీకే లగ్జరీ హోటల్స్‌‌‌‌గా మార్చుకుంది. యాజమాన్యంలో వచ్చిన మార్పుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ తన వద్ద ఉన్న మొత్తం వాటాలను జీవీకే భూపాల్ కుటుంబానికి విక్రయించింది. అయినప్పటికీ ఐహెచ్‌‌‌‌సీఎల్ సంస్థే తాజ్ బ్రాండ్ పేరుతో ఈ హోటళ్ల నిర్వహణను కొనసాగిస్తుంది. హైదరాబాద్, చెన్నై, ముంబై, చండీగఢ్‌‌‌‌లలో ఇప్పటికే ఆరు హోటళ్లు నడుస్తుండగా, బెంగళూరులో కొత్తగా తాజ్ యలహంక హోటల్‌‌‌‌ను ప్రారంభించనున్నారు.