ఏపీలో నేడు(నవంబర్ 3, 2026) పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. నిన్న (నవంబర్ 3, 2026) 92 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగగా, 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కౌంటింగ్ నిర్వహించనున్నారు. కార్పొరేషన్లకు సంబంధించి 22 చోట్ల కౌంటింగ్ కోసం 308 హాళ్లు, 4,026 టేబుళ్లు ఏర్పాటు చేయగా, లెక్కింపు కోసం 8,052 మంది సిబ్బంది, 16,104 మంది అసిస్టెంట్లు నియమించారు.
అలాగే 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించి 116 చోట్ల కౌంటింగ్ కేంద్రాల్లో 248 హాళ్లు, 2,805 టేబుళ్లు ఏర్పాటు చేసి, 5,610 మంది సిబ్బంది, 11,220 మంది అసిస్టెంట్లను నియమించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన అనంతరం స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి బ్యాలెట్ బాక్స్‌లను తరలించి వార్డుల వారీగా లెక్కింపు చేపట్టనున్నారు. బ్యాలెట్ బాక్స్ తెరిచాక ఓట్లను 25 చొప్పున కట్టలు కట్టి, ఏజెంట్లకు ఒక్కో ఓటు చూపించిన తర్వాత ఆయా ట్రేలలో వేసి లెక్కించనున్నారు.
