విశాఖలోని ఆయిల్ రిఫైనరీలో  భారీ అగ్ని ప్రమాదం..

విశాఖలోని ఆయిల్ రిఫైనరీలో  భారీ అగ్ని ప్రమాదం..

విశాఖపట్నంలోని హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. మంటలు భారీగా ఎగసిపడుతుండగా, దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను కమ్మేసింది.

మంటల తీవ్రతతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో జరిగిన నష్టం, ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు వెల్లడికావాల్సి ఉంది.