నాచారం లేడీస్ హాస్టల్‌లో అగ్ని ప్రమాదం

నాచారం లేడీస్ హాస్టల్‌లో  అగ్ని ప్రమాదం

హైదరాబాద్: నగరంలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సావర్కర్ నగర్‌లోని శ్రీ లక్ష్మి లేడీస్ హాస్టల్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

హాస్టల్‌లో మంటలు వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.ఈ అగ్నిప్రమాదానికి గల పూర్తి కారణాలు, జరిగిన ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు కూడా వెల్లడికావాల్సి ఉంది.