ఖైదీలకు ‘ఉల్లాసం’.. గేమ్స్, స్పోర్ట్స్ కార్యక్రమం ప్రారంభించిన జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా

ఖైదీలకు ‘ఉల్లాసం’.. గేమ్స్, స్పోర్ట్స్ కార్యక్రమం ప్రారంభించిన జైళ్ల శాఖ  డీజీ సౌమ్యమిశ్రా

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: జైళ్లలో ఉండే ఖైదీల్లో మానసిక ఒత్తిడి, నిరాశ, ప్రతికూల ఆలోచనలు సహా ఆత్మహత్యా ప్రవృత్తులను నివారించడంలో భాగంగా తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో 'ఉల్లాసం' పేరిట నూతన కార్యక్రమాన్ని చేపట్టారు. 

చంచల్‌‌‌‌‌‌‌‌గూడ సెంట్రల్‌‌‌‌‌‌‌‌ జైలు సహా విమెన్‌‌‌‌‌‌‌‌ జైలులో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని జైళ్ల శాఖ డీజీ  సౌమ్యమిశ్రా సోమవారం ప్రారంభించారు. ఖైదీలను వినోద, క్రీడా, సృజనాత్మక కార్యకలాపాల్లో పాల్గొనే విధంగా చేయడమే ‘ఉల్లాసం’ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. 

ఈ కార్యక్రమ నిర్వహణకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన ట్రెస్టిల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ సహకారం అందిస్తోందని తెలిపారు. ఖైదీల మానసిక ఆరోగ్యం కోసం ఇండోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అవుట్‌‌‌‌‌‌‌‌ డోర్ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌తో పాటు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నమన్నారు.