చాదర్‌‌‌‌ ఘాట్‌‌‌‌ లోని విక్టోరియా ప్లేగ్రౌండ్ లో GHMC స్పోర్ట్స్ మీట్ ప్రారంభం

చాదర్‌‌‌‌ ఘాట్‌‌‌‌ లోని విక్టోరియా ప్లేగ్రౌండ్ లో GHMC స్పోర్ట్స్ మీట్ ప్రారంభం

హైదరాబాద్ సిటీ, వెలుగు: చాదర్‌‌‌‌ఘాట్‌‌‌‌లోని విక్టోరియా ప్లేగ్రౌండ్ లో సోమవారం జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ మీట్ ను  కమిషనర్ కర్ణన్​​ప్రారంభించారు. 400 మంది ఉద్యోగులు, సిబ్బంది పేర్లు నమోదు చేసుకున్నారని, పురుషులు, మహిళలకు వేర్వేరుగా 11 క్రీడాంశాల్లో ఈ నెల 2 నుంచి 6వ తేదీ వరకు పోటీలు నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు. 

క్రికెట్ పోటీలు నాగోల్‌‌‌‌లోని డీఆర్ఎఫ్ క్రికెట్ గ్రౌండ్‌‌‌‌లో, బ్యాడ్మింటన్ పోటీలు ఆరంఘర్‌‌‌‌లోని కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌‌‌‌లో జరగనున్నాయని,  మిగతా  పోటీలను 4 నుంచి 6వ తేదీ వరకు చాదర్‌‌‌‌ఘాట్‌‌‌‌లోని వీపీజీలో నిర్వహించనున్నట్లు చెప్పారు.