న్యూఢిల్లీ, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ అని ఆ జిల్లా డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేశ్ జాదవ్ మండిపడ్డారు. భారీ బహిరంగ సభల పేరిట సీఎం రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం మాని, బీఆర్ఎస్ పాలనలో ఆదిలాబాద్లో చేసిన అభివృద్ధిపై ముందుగా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ సభ వేదికగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ, ఈ అంశంపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు తాము సిద్ధమని... కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్ల నిర్లక్ష్యం వల్ల ఆదిలాబాద్ జిల్లా నష్టపోయిందని ఆరోపించారు.
