న్యూఢిల్లీ: ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం రేవంత్ వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి ఉన్నారు. న్యూఢిల్లీలోని ప్రధాని నివాసం లోక్ కల్యాణ్‌మార్గ్‌లో ఈ సమావేశం జరుగుతోంది. ఎల్‌నినో వల్ల తెలంగాణలో ఏర్పడిన కరువు, వర్షాభావ పరిస్థితులపై ప్రధాని మోడీకి వివరించి కేంద్రాన్ని రూ.30 వేల కోట్ల తక్షణ సాయం కోరనున్నారు.
అలాగే, తెలంగాణ ప్రతిపాదిత తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరించాలని కేంద్రాన్ని రిక్వెస్ట్ చేయనున్నారు. గోదావరి–కావేరి నదుల అనుసంధానం, సమ్మక్క సాగార్ ప్రాజెక్టుకు అనుమతులపై ప్రధానితో చర్చించనున్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు 50 శాతం కేటాయించాలని కోరనున్నారు. హైదరాబాద్ వేదికగా జరగనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్, ఖేలో ఇండియా గేమ్స్ ఓపెనింగ్‌కు రావాలని సీఎం రేవంత్ మోడీని ఆహ్వానించనున్నారు.
