ఒకే రన్ వేపై రెండు విమానాలు.. ఒకటి ప్రయాణికులతో వెళ్తున్న బోయింగ్ విమానం కాగా.. రెండోది లగేజీని తీసుకెళ్లే కార్గో విమానం.. ఒకే సమయంలో రన్ వేపైకి రావడంతో ఢీకొన్నాయి. రన్ వేపై తక్కువ వేగంతో కదులుతున్నందున ఒక విమానం ముక్క భాగాన్ని, రెండో విమానం రెక్క తాగింది.దీంతో స్వల్పంగా డ్యామేజ్ అయింది. ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. అమెరికాలో టెక్నికల్ సమస్యతో దేశవ్యాప్తంగా విమానాలు రద్దు అయిన ఘటన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. అమెరికాలోని మియామి ఎయిర్ పోర్టులో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా తక్కువగా ఉండటంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే..
అమెరికాలోని మియామి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో రెండు విమానాలు ఢీకొన్నాయి. శనివారం (నవంబర్15) రాత్రి సుమారు 9:15 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.పనామా సిటీ నుంచి వస్తున్న కోపా ఎయిర్‌లైన్స్కు చెందిన బోయింగ్ 737 ప్రయాణికుల విమానం రెక్క.. ట్యాక్సీవేపై వెళ్తున్న యూపీఎస్ (UPS)కు చెందిన బోయింగ్ 767 కార్గో విమానం ముందు భాగాన్ని ఢీకొట్టింది.
కోపా ఎయిర్‌లైన్స్ విమానంలో 166 మంది ప్రయాణికులు, 6రుగు సిబ్బంది ఉన్నారు.ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఎయిర్‌పోర్ట్ పారామెడిక్స్ గాయపడిన అక్కడే చికిత్స అందించారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించారు. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
GROUND COLLISION INVOLVING UPS BOEING 767 AND COPA AIRLINES BOEING 737 AT MIAMI INTERNATIONAL AIRPORT A ground collision involving two Boeing aircraft occurred Saturday evening, 14 November 2026, at Miami International Airport (MIA), Miami, Florida, USA. The incident involved a UPS Boeing 767 freighter operating as UPS Flight 358 and a Copa Airlines Boeing 737 operating as Flight CM427, which had arrived from Panama City, Panama. According to information released by the Federal Aviation Administration (FAA), the collision occurred at approximately 9:15 p.m. local time at the intersection of two taxiways. During taxiing, the wingtip of the Copa Airlines Boeing 737 struck the nose section of the UPS Boeing 767, resulting in visible damage to the aircraft. Reports also indicate damage to the Copa aircraft's wingtip. Air traffic control recordings and preliminary reports indicate that the UPS aircraft had been instructed to give way to the arriving Copa flight. Following the incident, aircraft were redirected to alternative taxiways, while airport operations continued. Although no catastrophic consequences were reported, this incident once again highlights the importance of strict taxiway discipline, situational awareness, ground movement coordination and adherence to air traffic control instructions. ✈️ Ground safety is just as important as flight safety. 📍 Miami International Airport (MIA), Florida, USA 📅 14 November 2026 #Aviation #AviationSafety #AircraftIncident #GroundCollision #Boeing767
— FL360aero (@fl360aero) November 15, 2026
