సింథటిక్ దుస్తులకు చెక్.. హైదరాబాద్‌లో ‘క్రాఫ్ట్ కౌచర్’ చేనేత ఫ్యాషన్ బ్రాండ్ లాంచ్

సింథటిక్ దుస్తులకు చెక్.. హైదరాబాద్‌లో ‘క్రాఫ్ట్ కౌచర్’ చేనేత ఫ్యాషన్ బ్రాండ్ లాంచ్

హైదరాబాద్, వెలుగు: సింథటిక్ దుస్తులకు ప్రత్యామ్నాయంగా, చర్మానికి సౌకర్యవంతమైన సహజ చేనేత వస్త్రాలను రోజువారీ ఫ్యాషన్‌‌‌‌‌‌‌‌లోకి తెస్తూ ‘క్రాఫ్ట్ కౌచర్’  బ్రాండ్‌‌‌‌‌‌‌‌ను  హౌస్ ఆఫ్ గౌరీ సంస్థ తీసుకొచ్చింది.

ఇందుకోసం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ కోకాపేట్‌‌‌‌‌‌‌‌లోని  స్టోర్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేశారు.  గైనకాలజిస్ట్  స్వర్ణలత దీనిని ప్రారంభించారు. ఆఫీస్, క్యాజువల్ వేర్‌‌‌‌‌‌‌‌కు అనువుగా చీరలు, కుర్తీలు, డ్రెస్‌‌‌‌‌‌‌‌లు, రీసైకిల్డ్ ఫైబర్ కలెక్షన్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయని సంస్థ ఎండీ ఉదయ్ సాయి తెలిపారు. రూ.1,500 నుంచి రూ.30 వేల వరకు దుస్తులు లభిస్తుండగా, నవంబర్ 22–24 వరకు 11శాతం ప్రారంభోత్సవ రాయితీ ఇస్తున్నారు.