దక్షిణాది రాష్ట్రాల ఎన్డీయే ఎంపీలతో కిషన్ రెడ్డి విందు సమావేశం..

దక్షిణాది రాష్ట్రాల ఎన్డీయే ఎంపీలతో కిషన్ రెడ్డి విందు సమావేశం..

దక్షిణాది రాష్ట్రాల ఎన్డీయే ఎంపీలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విందు సమావేశం నిర్వహించారు. ఆదివారం ( నవంబర్ 29 )  రాత్రి జరిగిన ఈ సమావేశంలో ఏపీ, కర్ణాటక రాష్ట్రాల ఎంపీలు మినహా దక్షిణాది రాష్ట్రాల ఎన్డీఏ ఎంపీలు హాజరయ్యారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఈ విందు సమావేశం ఏర్పాటు చేశారు కిషన్ రెడ్డి. 

సోమవారం ( నవంబర్ 30 ) పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో కేంద్రం డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెడుతున్న క్రమంలో ఈ విందు సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఇదిలా ఉండగా.. ఎన్డీయేతర పక్షాలు కూడా డీలిమిటేషన్ బిల్లుకు తమ మద్దతు ప్రకటించిన క్రమంలో ఈ బిల్లు ఆమోదం పొందడం ఖాయమే అనిపిస్తోంది.

ఈ క్రమంలో డీలిమిటేషన్ కమిషన్ ప్యానెల్ పై క్లారిటీ ఇచ్చింది కేంద్రం. డీలిమిటేషన్ కమిషన్ ప్యానెల్ జ్ఞానేష్ కుమార్ హెడ్ గా వ్యవహరించరని.. సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఈ కమిషన్ ఉంటుందని తెలిపింది కేంద్రం. డీలిమిటేషన్ కమిషన్ లో సీఈసీ లేదా ఈసీలో ఒకరు సభ్యుడిగా ఉంటారని తెలిపింది. కమిషన్ లో ఒక చైర్మెన్, 12 మంది సభ్యులు ఉంటారని తెలిపింది కేంద్రం.