కూకట్పల్లి లులు మాల్లో దారుణం వెలుగు చూసింది. పండగ సందర్భంగా షాపింగ్కు వచ్చిన కస్టమర్ కొన్న కిట్ క్యాట్ చాక్లెట్లో పురుగులు బయటపడ్డాయి. పిల్లల కోసం కొన్న చాక్లెట్లో పురుగులు ఉండటంతో షాక్ అయ్యాడు కస్టమర్. శుక్రవారం ( అక్టోబర్ 16 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
కూకట్పల్లి లులు మాల్లో షాపింగ్ చేసిన ఓ కస్టమర్ , పిల్లల కోసం కిట్ క్యాట్ చాక్లెట్లు కొన్నారు.ఇంటికి వచ్చి ఓపెన్ చేసి చూడగా అందులో పురుగులు కదులుతూ కనిపించాయి. దీంతో కస్టమర్ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. పిల్లలు తినే చాక్లెట్లలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.వెంటనే కంపెనీకి ఫిర్యాదు చేసినట్లు కస్టమర్ తెలిపారు.
లులు మాల్ లాంటి పెద్ద మాల్లోనే, నిల్వ సరిగా లేని ఉత్పత్తులు అమ్ముతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఫుడ్ సేఫ్టీ అధికారులు లులు మాల్లో తనిఖీలు చేపట్టి, నాసిరకం చాక్లెట్లపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. పండగ వేళ చాక్లెట్లు, స్వీట్లు కొనేటప్పుడు వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు.ఈ ఘటనపై కిట్ క్యాట్ కంపెనీ, లులు మాల్ యాజమాన్యం స్పందించాల్సి ఉంది.
