న్యూఢిల్లీ: టెస్లా అధినేత, బిలియనీర్ ఎలన్ మస్క్‌పై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు. భారత్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ సేవల అనుమతుల జాప్యంపై మోడీ సర్కార్‌ను ఎలన్ మస్క్ లక్ష్యంగా చేసుకోవడాన్ని ఓవైసీ తీవ్రంగా తప్పబట్టారు. దేశ అంతర్గత విషయాల్లో విదేశీయుల జోక్యాన్ని సహించబోమని హెచ్చరించారు. ఒక తెల్లవాడు మన దేశానికి ఆర్డర్లు వేయలేడని.. దేశ వనరులను ఎలా ఉపయోగించుకోవాలో నిర్ణయించే హక్కు భారతదేశానికే ఉందని స్పష్టం చేశారు.
మేము రాజకీయంగా ఎప్పుడూ ప్రధాని మోడీని వ్యతిరేకిస్తాం.. భవిష్యత్‌లోనూ వ్యతిరేకిస్తూనే ఉంటాం. కానీ ఒక తెల్ల జాతీయుడు భారతదేశానికి నిజమైన ప్రధాని అంబానీనా అని ఎలా మాట్లాడుతాడని ప్రశ్నించారు. మన దేశ నిర్ణయాధికారాల గురించి ఒక విదేశీయుడు ఇలా ఎలా మాట్లాడుతాడని నిలదీశారు.
ప్రధాని మోడీతో ఎన్ని రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. దేశ గౌరవానికి భంగం కలిగించేలా విదేశీయులు మాట్లాడితే మాత్రం సహించేది లేదని పేర్కొన్నారు. జాతీయవాదం గురించి గొప్పులు చెప్పుకునే బీజేపీ ప్రభుత్వం ఒక విదేశీ వ్యాపారవేత్త దేశాన్ని శాసించాలని చూస్తుంటే ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని క్వశ్చన్ చేశారు. బీజేపీకి తెల్ల జాతీయులు అంటే ఎందుకుంత భయమని ప్రశ్నించారు.
దేశ వనరులను ఎలా ఉపయోగించాలో నిర్ణయించే హక్కు పూర్తిగా భారతదేశానికే ఉందన్న ఓవైసీ.. ఏ విదేశీ పెట్టుబడిదారుడి ఒత్తిళ్లకు ప్రభుత్వం లొంగకూడదని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోనే అత్యల్ప డేటా ఛార్జీలు ఉన్నాయన్నారు. మనం రష్యా ముడి చమురు కొనుగోలును ఆపాలని అమెరికా కోరుకుంటోంది. కానీ రష్యా డీజిల్‌ను అమెరికా కొనుగోలు చేస్తోందని ట్రంప్ ద్వంద్వ వైఖరిని తప్పుబట్టారు. ప్రధాని మోడీ 56 అంగుళాల ఛాతీని చూపించి మస్క్‌కు బై, బై అని చెప్పాలని సూచించారు. నిత్యం మోడీపై విరుచుకుపడే ఓవైసీ మస్క్ వ్యాఖ్యల విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలవడం విశేషం.
ALSO READ : 16 ఏళ్ల పిల్లోడు.. స్కూల్ లో ముగ్గురు పిల్లలని తుపాకీతో కాల్చి చంపేశాడు
అసలు వివాదం ఏంటంటే..?
భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సంస్థ ప్రయత్నిస్తోంది. లైసెన్స్ కోసం కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు కూడా చేసుకుంది. అయితే, వివిధ కారణాలతో స్టార్‌లింక్‌కు ప్రభుత్వం లైసెన్స్ మంజూరు చేయలేదు. ఈ క్రమంలో స్టార్‌లింక్‌కు లైసెన్స్ జారీలో జాప్యంపై కేంద్ర ప్రభుత్వం, బిలియనీర్ ముకేష్ అంబానీని టార్గె్ట్ చేసుకుని మస్క్ విమర్శలు చేశాడు. భారత్‌లో కొందరు బడా పారిశ్రామికవేత్తలు తన కంపెనీ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ముఖేష్ అంబానీని ఉద్దేశించి వ్యంగ్యంగా ఆయనే భారత్‌కు నిజమైన బాసా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
