కొత్త రాజకీయ పార్టీ పెట్టిన.. మాజీ మహిళా IAS అధికారిణి దివ్య

కొత్త రాజకీయ పార్టీ పెట్టిన.. మాజీ మహిళా IAS అధికారిణి దివ్య

దేశ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ చేరింది. మాజీ ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ‘‘జన్ నీతి భారత్ ’’పేరుతో పార్టీని ప్రకటించారు. ప్రజల సమస్యలే ప్రధాన అజెండాగా, అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు, ప్రభుత్వ పనితీరుపై ప్రజలకు జవాబుదారీతనం ఉండేలా చూడటం తన పార్టీ ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. X లో పోస్ట్ చేసిన ఓ వీడియో మేసేజ్ మిట్టల్ ఈ విషయాన్ని వెల్లడించారు. 

13 ఏళ్ల సర్వీస్ తర్వాత సెప్టెంబర్29న దివ్య మిట్టల్.. ఐఏఎస్‌కు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజా సేవలో కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్లు మిట్టల్ ..2027లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీలో ఉంటుందని ప్రకటించారు. 

ALSO READ : ఒకే దేశం.. ఒకే పార్టీ.. ప్రధాని మోదీ అజెండా

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) ఢిల్లీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) బెంగళూరు లో విద్యా పూర్తి చేసిన మిట్టల్‌కు వాల్ స్ట్రీట్ ట్రేడర్‌గా కూడా అనుభవం ఉంది. లండన్‌లోని లిమాన్ బ్రదర్స్ , అమెరికాలోని ప్రముఖ ఆర్థిక సంస్థల్లో ఆమె వాల్ స్ట్రీట్ ట్రేడర్‌గా సక్సెస్ అయ్యారు.  ఆ తర్వాత భారతదేశం తిరిగి వచ్చి యూపీ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణిగా సుమారు 13 ఏళ్ల పాటు దేశానికి సేవలు అందించారు.