బీజేపీ మాజీ ఎమ్మెల్యేను కొట్టి చంపిన జనం

బీజేపీ మాజీ ఎమ్మెల్యేను కొట్టి చంపిన జనం

రాజస్థాన్ లో ఓ మాజీ ఎమ్మెల్యేను ప్రజలు కొట్టిచంపడం కలకలం రేపుతోంది. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లా, భోండాలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే అతర్ సింగ్ భదానాను కొంతమంది స్థానికులు  గుంపుగా దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో  ఆయన అక్కడికక్కడే చనిపోయారు. అతర్ సింగ్ భదానా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ కిసాన్ మోర్చా నేత. క్రషర్ మిల్లు ప్లాంటు,మైనింగ్ లీజు విషయంలో చాలాకాలంగా కొనసాగుతున్న వివాదంలో అతర్ సింగ్ ను లోకల్స్ హత్యచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భదానా పశువుల మేత భూము(బంజరు భూములను) ఆక్రమించి, అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. 

పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం (అక్టోబర్ 11, 2026) భదానా, అతని సహచరుడు గగన్ శర్మ  వివాదాస్పద క్రషర్ మిల్లు ప్రదేశానికి వెళ్లగా స్థానికులతో వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో కర్రలు, ఇనుపరాడ్లు, రాళ్లతో 70నుంచి 80 మంది గ్రామస్తులు అతనిపైదాడి చేశారు. ఈ దాడిలో భదానాకు తీవ్రంగా గాయాలయ్యాయి. చేతులు, కాలు విరిగాయి, తలకు తీవ్రమైన గాయాలు కాగా జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతిచెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. 

ALSO READ : ఎలాన్ మస్క్‌ను కొడతాను అంటున్న బీజేపీ ఎంపీ ఎవరు..?

ఈ కేసులో 40 మంది స్థానికులపై  కేసు నమోదు చేసి పోలీసులు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా భోండాగ్రామంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. సీఎం భజన్ లాల్ శర్మ సొంత జిల్లా అయిన భరత్‌పూర్‌లో ఈ ఘటన జరిగడంతో చర్చనీయాంశమైంది. మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, ప్రతిపక్ష నేతలు రాజస్థాన్ లో శాంతిభద్రతలపై తీవ్రస్థాయిలో ప్రభుత్వాన్ని  విమర్శించారు.