డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు ఇవ్వడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సుమారు 22 ఏళ్లుగా సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బిల్లుకు డీఎంకే మద్దతు ప్రకటించడంపై వీ ది లీడర్స్ ఫౌండేషన్ చీఫ్ కె. అన్నామలై అనుమానాలు వ్యక్తం చేశారు. డీఎంకే మద్దతు పూర్తిగా షరతులతో కూడుకున్నదని, ఆ షరతులేంటో రాబోయే రోజుల్లో బయటపడతాయని అన్నారు.
డీఎంకే మద్దతు 100 శాతం షరతులతో కూడుకున్నదని, ఆ షరతులేంటో రాబోయే రోజుల్లో తెలుస్తాయని అన్నారు. డీఎంకే మద్దతుతో జాతీయ రాజకీయాల్లో కూటముల సమీకరణాలు మారే అవకాశం ఉందని అన్నామలై అన్నారు. ఈ పరిణామం రాజకీయ పునరేకీకరణకు దారితీస్తుందా? కేంద్ర మంత్రివర్గ విస్తరణకు కారణమవుతుందా? అన్నది వేచి చూడాలన్నారు. డీఎంకే నేతలు, మంత్రులపై గతంలో నమోదైన కేసుల విషయంలో ఈడీ, సీబీఐ తదుపరి చర్యలు ఎలా ఉంటాయో కూడా ఆసక్తికరంగా మారిందన్నారు.
2027లో కేంద్రం చేపట్టే తదుపరి ప్రధాన రాజకీయ సంస్కరణ ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ కావచ్చని అన్నామలై అంచనా వేశారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించే ప్రతిపాదన దేశ రాజకీయ సమీకరణాలను మారొచ్చన్నారు.
ALSO READ : డీలిమిటేషన్ అమలైతే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది: రాహుల్ గాంధీ
అయితే తమిళనాడు లోక్సభ స్థానాల వాటాను 7.18 శాతం నుంచి తగ్గించకుండా, రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్య నిష్పత్తిని మరో 25 ఏళ్ల పాటు కొనసాగించాలన్న తమ డిమాండ్లకు కేంద్రం ప్రతిపాదనలో చోటు కల్పించడంతోనే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు డీఎంకే ప్రకటించింది. ఈ మద్దతు ఎన్డీఏతో రాజకీయ పొత్తు కాదని కూడా స్పష్టం చేసింది.
