ఈ చెత్త బౌలింగ్‌తో మనం వరల్డ్కప్ గెలవడం చాలా కష్టం.. మాజీ క్రికెటర్ వ్యాఖ్యలు వైరల్

ఈ చెత్త బౌలింగ్‌తో మనం వరల్డ్కప్ గెలవడం చాలా కష్టం.. మాజీ క్రికెటర్ వ్యాఖ్యలు వైరల్

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత జట్టు 24 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. విండీస్ నిర్దేశించిన 247 రన్స్ లక్ష్య ఛేదనలో టీమిండియా ఘోరంగా తడబడింది. ఈ నేపథ్యంలో ఇండియన్ బౌలర్ల ప్రదర్శనపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుత బౌలింగ్ కాంబినేషన్‌తో భారత్ ఐసీసీ ప్రపంచకప్ గెలవడం చానా కష్టమని తేల్చి చెప్పేశాడు. 

బౌలర్ల వైఫల్యమే భారత్ కొంపముంచింది: 

మాజీ క్రికెటర్ కైఫ్ మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ మ్యాచ్‌లో భారత్ ఓటమికి ప్రధాన కారణం బౌలింగ్ వైఫల్యమే.. బౌలర్లు భారీగా పరుగులు సమర్పించారు. 247 రన్స్ ఇవ్వడమంటే మాములు విషయం కాదు. ఇదే తొలిసారి కాదు, అంతకుముందు కూడా 250+ టార్గెట్‌ను కాపాడుకోవడంలో భారత బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో బ్యాటర్లు 3 మ్యాచ్‌లు గెలిపిస్తే.. మిగతా రెండింటిని బౌలర్లు ఓడించారు. ఇలాంటి కాంబినేషన్‌తో ప్రపంచకప్ నెగ్గడం అసాధ్యం అని కైఫ్ హెచ్చరించారు.

ALSO READ : రూ.3 కోట్ల జీతం.. అయినా బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి నో చెప్పిన మాజీలు!

2024 ప్రపంచకప్ విజయంతో పోలిక: 

2024 టీ20 ప్రపంచకప్ విజయంలో జట్టులోని ప్రతి ఒక్కరూ భాగస్వామిగా నిలిచారు అని మహమ్మద్ కైఫ్ గుర్తు చేశారు. జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్లతో పాటు బ్యాటర్లు సత్తా చాటారని పేర్కొన్నాడు. ఇక నాలుగో టీ20లో ఓపెనర్ అభిషేక్ శర్మ నెమ్మదిగా ఆడాడంటూ వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ప్రతి బ్యాటర్ అన్ని రోజులూ అద్భుతంగా ఆడటం కష్టమని, సంజు శాంసన్ మాత్రం జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడని కైఫ్ అభిప్రాయపడ్డారు.