రూ.3 కోట్ల జీతం.. అయినా బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి నో చెప్పిన మాజీలు!

రూ.3 కోట్ల జీతం.. అయినా బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి నో చెప్పిన మాజీలు!

BCCI Selector Job: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డైన బీసీసీఐ (BCCI) లో ఏ చిన్న పదవి ఆఫర్ వచ్చినా ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ, ఈసారి మాత్రం జాతీయ సెలక్టర్ పదవిపై ఇండియన్ మాజీ క్రికెటర్లు పెద్దగా ఆసక్తి చూపించకపోవడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతిష్టాత్మకమైన ఈ పోస్టు కోసం బోర్డు దరఖాస్తులను ఆహ్వానించగా ఊహించని స్పందన వచ్చింది. వందకు పైగా టెస్టులు ఆడిన ఇద్దరు దిగ్గజ మాజీలు తమ దగ్గరకు వచ్చిన బీసీసీఐ డైరెక్ట్ ఆఫర్‌ను కూడా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి.

అగార్కర్ స్థానంలో కొత్త చీఫ్ సెలక్టర్: 

నాలుగేళ్ల పాటు భారత క్రికెట్ నియంత్రణ మౌలిక వ్యవస్థలో చీఫ్ సెలక్టర్ బాధ్యతలను నిర్వర్తించిన అజిత్ అగార్కర్ (Ajit Agarkar) పదవీ కాలం అక్టోబర్ 4వ తేదీతో ముగిసింది. అగార్కర్ నిష్క్రమణతో వెస్ట్ జోన్ నుంచి ఖాళీ అయిన సెలక్టర్ పోస్టు కోసం బీసీసీఐ దరఖాస్తులు కోరగా, గడువు ముగిసే సమయానికి కేవలం రమేశ్ పొవార్, సమీర్ దిఘే మాత్రమే అప్లై చేసుకున్నారు. మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ దరఖాస్తు చేసుకుంటే అతడే చీఫ్ సెలక్టర్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉండేవి.. కానీ అతడు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో, ప్రస్తుతం తాత్కాలిక బాధ్యతల్లో ఉన్న ప్రజ్ఞాన్ ఓజా (Pragyan Ojha) రెగ్యులర్ చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం ఫిక్స్ అయింది. 

భారీగా జీతం.. బాధ్యతలు ఇవే!: 

దశాబ్దాల కిందటిలా కాకుండా ప్రస్తుత ఆధునిక యుగంలో సెలక్టర్ల వేతనాలను బీసీసీఐ భారీగా పెంచింది. 

* రూ.19.35 కోట్ల బడ్జెట్: సెలక్షన్ కమిటీకి మొన్నటివరకు రూ.17.45 కోట్ల బడ్జెట్ ఉండగా, 2026-27 ఆర్థిక సంవత్సరానికి దానిని ఏకంగా రూ.19.35 కోట్లకు సవరించింది.

* చీఫ్ సెలక్టర్ జీతం: బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా పని చేసే వ్యక్తికి ఏడాదికి ఏకంగా రూ.3 కోట్ల వరకు వేతనం అందుతుంది. మిగతా సభ్యులకు కూడా మెరుగైన ప్యాకేజీలు లభిస్తాయి.

ALSO READ : వైభవ్ సూర్యవంశీకి మళ్లీ నిరాశే.. 

* కీలక బాధ్యతలు: ప్రతిష్ఠాత్మక వేతనంతో పాటు బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉంటాయి. దేశవాళీ (Domestic), అంతర్జాతీయ మ్యాచుల్లో ప్లేయర్ల ప్రదర్శనను నిరంతరం పరిశీలించడం, ప్రయాణాలు చేయడం, జట్లకు కెప్టెన్లను సెలక్ట్ చేయడంతో పాటు  ప్రతి మూడు నెలలకొకసారి అపెక్స్ కౌన్సిల్‌కు నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ కఠినమైన ప్రయాణాలు, తీవ్రమైన ఒత్తిడి కారణంగానే చాలా మంది మాజీ క్రికెటర్లు కోట్లలో జీతం లభిస్తున్నా ఈ పదవులకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.