ఒకే దేశం.. ఒకే పార్టీ.. ప్రధాని మోదీ అజెండా: సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే

ఒకే దేశం.. ఒకే పార్టీ.. ప్రధాని మోదీ అజెండా: సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే

కేంద్ర ప్రభుత్వం, ప్రధానిమోదీ, అమిత్ షాలపై కాక్రోచ్ జనతా పార్టీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ నినాదం ‘‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’’  వెనక  అసలు అజెండా..‘‘ఒకే దేశం,ఒకే పార్టీ ‘‘అని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఒకే దేశం.. ఒకే ఎన్నిక ప్రతిపాదనే సరైంది కాదని అభిజిత్ దీప్కే వ్యతిరేకించారు.  సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు ప్రధాని మోదీ ప్రభుత్వం ఎందుకంత ప్రాధాన్యం ఇస్తోందని దీప్కే ప్రశ్నించారు.  ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ సొంత దేశ ప్రజలపైనే యుద్ధం చేస్తున్నారని విమర్శించారు. 

గురువారం మీడియా సమావేశంలో  మాట్లాడినదీప్కే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్తించారు. జ్ఞానేశ్ కుమార్‌ను రక్షించేందుకే నిరసనలపై ఆంక్షలు విధించేందుకు భద్రతా బలగాలను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడాన్ని కూడా చట్ట ఉల్లంఘనగాభావించడం, జైళ్లకు తరలించడం ఏంటని ప్రశ్నించారు. 

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కోసం ఢిల్లీలో రవాణా వ్యవస్థలకు అంతరాయం కలిగించారని హోంమంత్రి అమిత్ షాపై విరుచుపడ్డారు దీప్కే.  మెట్రో సేవలను నిలిపివేశారని, భారీగా భద్రతా బలగాలను మోహరించారని ఆరోపించారు.  నిరసనల్లో పాల్గొన్న విద్యార్థి సంఘాల నేతుల, ప్రతిపక్ష నేతలు, మాజీ సీఎంలను అదుపులోకి తీసుకున్నారని విమర్శించారు. ఇదంతా చూస్తుంటే ఎన్నికల్లో మోదీకి జ్ఞానేశ్ కుమార్ సహాయం చేస్తున్నారనే అనుమానాలు ఎందుకు రాకూడదని ప్రశ్నించారు. 

ALSO READ : జంతర్ మంతర్ డీనోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టు సీరియస్

ఒకే దేశం.. ఒకే పార్టీ  బీజేపీ ప్రభుత్వ అజెండా

సీఈసీ రాజీనామా కోరుతూ సీజేపీ, ప్రతిపక్షాల నిరసనలపై ఆంక్షలు విధించడం, యువ కార్యకర్తలను నిర్బంధించడంపై దీప్కే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఈసీని రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఉపయోగిస్తోందని ఆరోపించారు.  ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ ప్రతిపాదనను కూడా వ్యతిరేకించిన దీప్కే.. కేంద్ర ప్రభుత్వ అసలు అజెండా ‘ఒకే దేశం.. ఒకే పార్టీ’ అని దీప్కే విమర్శించారు.  ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ సొంత దేశ ప్రజలపైనే యుద్ధం చేస్తున్నారని ఎవరికోసం ఇదంతా చేస్తున్నారని ప్రశ్నించారు దీప్కే. దేశంలో ప్రజాస్వామ్య నిరసనలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.