స్కూల్ పైకప్పు కూలి..33 మంది చిన్నారులు చనిపోయారు

స్కూల్ పైకప్పు కూలి..33 మంది చిన్నారులు చనిపోయారు

పాకిస్తాన్ లోని పెషావర్ లో ఘోరం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్ పైకప్పు కూలి 33 మంది విద్యార్థులు మృతిచెందారు. ఈ ఘటనలో ఓ టీచర్ కూడా చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు వెల్లడించారు. పెషావర్ లో అల్ ఖైర్ ఎడ్యుకేషన్ సెంటర్ స్కూల్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రోజువారీ  స్కూల్ కార్యక్రమాల్లో భాగంగా క్లాస్ రూంలో టీచింగ్ జరుగుతుండగా ఒక్కసారిగా స్కూల్ పైకప్పు కూలి విద్యార్థులపై పడింది.  

సమాచారం అందుకున్న రెస్క్యూ టీం సంఘటనా స్థలానికి చేరుకుని  సహాయ చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న   రక్తసిక్తమయిన విద్యార్థులను బయటికి తీస్తున్న వీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటివరకు 45 మంది విద్యార్థులను రెస్క్యూటీం రక్షించగా.. మరికొంత మంది విద్యార్థులు శిథిలాల కింద ఉన్నట్లు  తెలుస్తోంది. గాయపడిన విద్యార్థులను సమీప ఆస్పత్రులకు తరలించారు. 

►ALSO READ | జాబ్ నుంచి తీసేశారని.. ముగ్గురు మహిళా మేనేజర్లను తుపాకీతో కాల్చి చంపేశాడు..!

ఇప్పటివరకు ఓ ఉపాధ్యాయుడితో సహా 33 మంది విద్యార్థులు చనిపోగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు.  ఈ ఘటనపై అధికారులు దర్యాప్తుకు ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు.