జాబ్ నుంచి తీసేశారని.. ముగ్గురు మహిళా మేనేజర్లను తుపాకీతో కాల్చి చంపేశాడు..!

జాబ్ నుంచి తీసేశారని.. ముగ్గురు మహిళా మేనేజర్లను తుపాకీతో కాల్చి చంపేశాడు..!

అది ఒక సూపర్ మార్కెట్... ఎప్పటిలాగే కస్టమర్లు వాళ్లకు కావాల్సినవి కొనుక్కోవడంలో బిజీగా ఉన్నారు.. బిల్లింగ్ కౌంటర్ దగ్గర బిల్లింగ్ పూర్తయ్యాక ఆఒక్కోక్కరుగా కస్టమర్లు బయటికి వెళ్తున్నారు. ఇంతలో గన్ పేలినట్లు పెద్ద పెద్ద శబ్దాలు వినియించాయి. దీంతో ఆ సూపర్ స్టోర్ లో ఉన్నవాళ్ళంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు, బయటికి పరుగులు తీశారు. ఆ సూపర్ స్టోర్ కి సంబంధించిన ఆఫీసు లోపల ఓ వ్యక్తి ముగ్గురిని గన్ తో కాల్చి చంపేశాడు. సౌత్ ఆఫ్రికాలోని క్వాజులా-నటాల్ లో జరిగింది ఈ ఘటన. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

క్వాజులా నటాల్ లోని బాక్సర్ సూపర్ స్టోర్ లో జరిగింది ఈ ఘటన. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో నల్ల దుస్తులు ధరించిన ఉద్యోగి ముగ్గురు మహిళా ఉద్యోగులను గన్ తో వరుస కాల్పులు జరిపి చంపేశాడు. సదరు మహిళా మేనేజర్లు అతడిని ఉద్యోగంలో నుంచి తీసేయడమే ఇందుకు కారణం. ఇంటర్నల్ డిసిప్లినరీ హియరింగ్ కోసం వెళ్లిన నిందితుడు తనను ఉద్యోగం నుంచి తీసేశారన్న కోపంతో మహిళా మేనేజర్లను కాల్చి చంపేశాడని ధ్రువీకరించింది బాక్సర్ స్టోర్స్ సంస్థ.

మహిళలపై వరుస కాల్పులు జరిపిన నిందితుడు అక్కడితో ఆగకుండా గన్ రెండోసారి రీలోడ్ చేసి కాల్చడం అతని ఉన్మాదానికి పరాకాష్టగా నిలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.

ALSO READ : బీజేపీ మాజీ ఎమ్మెల్యేను కొట్టి చంపిన జనం