బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మేనల్లుడు, నటుడు ఇమ్రాన్ ఖాన్ కు ముంబై పోలీసులు ఊహించని షాకిచ్చారు. 2026 అక్టోబర్ 28 లోపు దేశం విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జరిగిన ఆందోలనల్లో పాల్గొనటంతో ఆయనకు నోటీసులు పంపారు పోలీసులు.
ముంబైలోని క్రాంతి మైదానంలో 2026 ఆగస్టులో జరిగిన నిరసనల్లో పాల్గొన్న ఇమ్రాన్ ను అప్పట్లో అదుపులోకి కూడా తీసుకున్నారు. నిరసన ప్రదర్శనలు చేసినట్లు కూడా పోలీసులు ఆరోపిస్తున్నారు.
ఇమ్రాన్ కు పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం ఉంది. ఇండియాలో నివసించడానికి, పని చేయడానికి అనుమతించే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డును కలిగి ఉన్నారు. ఇమిగ్రేషన్ పై ఇండియా వచ్చిన ఆయన.. నిరసనలో పాల్గొన్నారనే ఆరోపణలపై ఇమ్మిగ్రేషన్ చట్టంలోని నిబంధన కింద చర్య తీసుకున్నారు. అక్టోబర్ 28 లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు.
అంతకుముందు, అక్టోబర్ 10న, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ ముంబైలోని ఆగస్ట్ క్రాంతి మైదాన్‌లో జరిగిన నిరసనలో పాల్గొన్నారు, అనంతరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
2026 అక్టోబర్ 10న సాయంత్రం 5:20 గంటలకు ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే, ఆ నటుడు పోలీసు వ్యాన్ లోపల నుండి ఒక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ, నేను డ్రైవ్‌కు వెళ్తున్నట్టున్నాను అని దానికి క్యాప్షన్ పెట్టారు.
తనను నిర్బంధించడానికి ముందు, ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, నాకు ఎలాంటి డిమాండ్లు లేవు. నేను ఈ సిటీలో నివసించే ఒక పౌరుడిగా ఇక్కడ ఉన్నాను. స్వేచ్ఛగా తిరిగే హక్కును ఎందుకు పరిమితం చేస్తున్నారో, ప్రజల గొంతులను ఎందుకు అణచివేస్తున్నారో తెలుసుకోవడానికే నేను ఇక్కడ ఉన్నాను. నేను ఎవరినీ డిమాండ్లు చేసే స్థితిలో లేను. నేను ఏ సంస్థలోనూ సభ్యుడిని కాను. నేను కేవలం ఒక ప్రతినిధిగా ఇక్కడ ఉన్నాను అని అన్నారు.
