30 ఏళ్లు వచ్చేలోపు ఎవరైనా కెరీర్లో సెటిలై ఉండాలి. ముప్పై వచ్చాక తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాల్సిందే. ఈ వయసులోనే ఒక వ్యక్తి అసలైన లైఫ్ స్టార్ట్ అవుతుంది. సంపాదన, సేవింగ్స్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, హెల్త్ ఇలా బోలెడు విషయాల్లో కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన సమయం ఇది. వీటన్నింటి విషయంలో ఒక ప్లాన్ ప్రకారం నడుచుకున్నప్పుడే లైఫ్ ప్రాబ్లమ్స్ రాకుండా సాఫీగా సాగుతుంది. ఈ విషయంలో 30 ఏళ్లు వచ్చిన వాళ్లందరికీ నిపుణులు అందిస్తున్న కొన్ని సూచనలు తెలుసుకుందాం రండి...
ఫైనాన్షియల్ ప్లాన్:
అన్నింటిలో కంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సింది డబ్బు విషయంలోనే. ఆదాయం, ఖర్చు, సేవింగ్స్ విషయంలో పూర్తి అవగాహనతో ఉండాలి. నెలకు సరిపడా బడ్జెట్ ప్లాన్ వేసుకుని అమలు చేయాలి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. తక్కువ బడ్జెట్లో కంఫర్ట్‌గా ఎలా ఉండొచ్చో ఆలోచించాలి. అన్నింటికీ మించి సేవింగ్స్‌పై ఎక్కువ దృష్టిపెట్టాలి.
హెల్త్ ముఖ్యం బిగులు:
ఆరోగ్యంతోపాటు.. ఫ్యామిలీ హెల్త్ కూడా దృష్టిపెట్టాలి. ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ల ట్రీట్మెంట్ గురించి ఆలోచించాలి. భవిష్యత్‌లో హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే కచ్చితంగా వ్యాయామం చేయాల్సిందే. టైమ్‌కు తినడం, నిద్రపోవడం, స్ట్రెస్ తగ్గించుకోవడం చేస్తూ ఉంటే చాలావరకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. ఇంకా హెల్దీ డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. 30 ఏళ్లు దాటాక వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీ, షుగర్ వంటివి రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇవన్నీ సరైన వ్యాయామం, ఆహారపు అలవాట్లతోనే సాధ్యం.
బ్యాడ్ హ్యాబిట్స్:
ఆల్కహాల్ డ్రింకింగ్, స్మోకింగ్ వంటి అన్ హెల్దీ హ్యాబిట్స్ ఉంటే మెల్లిగా మానేడయం బెటర్. ఈ అలవాట్లను మెల్లిగా తగ్గించుకుంటే ఎంతో హెల్దీగా ఉంటారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా సంతోషిస్తారు.
ప్లాన్ యువర్ గోల్స్:
ఉద్యోగంలో చేరిన వాళ్లలో ఎక్కువ మంది మెయిన్ గోల్ సొంత ఇల్లు కట్టుకోవడమే. ఇంకొంత మంది పొలం, ల్యాండ్స్ కొనిపెట్టుకోవాలనుకుంటుంటారు. ఇలాంటి లక్ష్యాలుంటే సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ లోన్ తీసుకోవాల్సి వస్తే.. వారి ఆర్థిక పరిస్థితుల స్థాయిని బట్టి అంచనా వేసుకున్నాకే లోన్స్ జోలికి వెళ్లటం బెటర్. కట్టేద్దాం లే అని గుడ్డిగా లోన్స్ తీసుకుని తర్వాత జాబ్ లో ప్రాబ్లమ్ వస్తే ఎదుర్కోవటం చాలా కష్టతరం అవుతుందని గుర్తుంచుకోండి.
