జ్యోతిష్యం: ఏ తేదీన పుట్టిన వారు ఎప్పుడు జాబ్ లో చేరాలి.. వ్యాపారం ప్రారంభించాలి..

జ్యోతిష్యం:   ఏ తేదీన పుట్టిన వారు  ఎప్పుడు జాబ్ లో చేరాలి.. వ్యాపారం ప్రారంభించాలి..

కొత్తగా ఏ పనిని ప్రారంభించాలన్నా.. ఉద్యోగంలో చేరాలన్నా.. కంపెనీ మారే సయమంలో.. ప్రమోషన్​ వచ్చిన సమయంలో కొత్త బాధ్యతలు తీసుకొనేటప్పుడు పండితులను సంప్రదిస్తారు చాలామంది.  పుట్టిన తేదీ ఆధారంగా.. .జాతకం ప్రకారం.. ఏరోజు మంచిరోజే తెలుసుకొని ఆ రోజు చేరతాము.  సంఖ్యా శాస్త్రం రాడిక్​ సంఖ్య ఆధారంగా ఏ రోజు పుట్టిన వారికి ఏ తేది మంచిది.. రాడిక్​ సంఖ్య అంటే ఏమిటో ఎవరు ఏ తేదీన జాబ్​ మారాలి.. కొత్త ఉద్యోగంలో చేరితే కెరీర్​ పరంగా అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం.. . !

చాలామంది ఉద్యోగంలో చేరిన కొద్దిరోజులకే మంచి పురోగతిని సాధిస్తారు. వ్యాపారంలో కూడా అంతే జరుగుతుంది.  కొంతమందికి మాత్రం ప్రతికూల పరిస్థితులు ఉంటాయి.  సంఖ్యాశాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ పనిని ప్రారంభించిన తేదీ మీకు అనుకూలంగా లేకపోతే ఇబ్బందులు పడతారని చెబుతున్నారు.  పుట్టిన తేది రాడిక్​ సంఖ్య .. ఏ తేదికి సరిపోతుందో చూసుకోవాలని చెబుతున్నారు.ఇప్పుడు ఆ వివరాల గురించి తెలుసుకుందాం..! 

రాడిక్​ సంఖ్య అంటే ఏమిటి

సంఖ్యాశాస్త్రం ప్రకారం  పుట్టిన తేదీని రాడిక్​ సంఖ్య అంటారు.  ఏ నెలలో పుట్టినా కాని .. డేట్​ ఆఫ్​ బర్త్​ ను పరిగణనలోకి తీసుకొని రాడిక్​ నంబర్​ లెక్క కట్టాలి.  రాడిక్​ సంఖ్యలు 1 నుంచి 9 వరకు ఉంటాయి.  ఉదాహరణకు మీరు 15 వ తేది జన్మించనట్లేయితే 1+5=6 .. దీని ప్రకారం మీ రాడిక్​ సంఖ్య 6 అవుతుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం 15 వ తేది పుట్టిన వారి జాతకం మూల సంఖ్య6 ఆధారంగా ఫలితాలు చెబుతుంటారు.
 
రాడిక్​ సంఖ్య ఆధారంగా ఎవరు ఏ తేదీన జాబ్​లో చేరాలి.. కొత్త పనులు ప్రారంభించాలో తెలుసుకుందాం. .!

రాడిక్​ సంఖ్య1: సంఖ్యాశాస్త్రం ప్రకారం మీరు పుట్టిన తేదీ మూల సంఖ్య 1 అయితే ఇలాంటి వ్యక్తులు స్నేహ పూర్వకమైన సంబంధాలు కలిగి ఉంటారు.  ఇలాంటి వారు కొత్త పనులు చేపట్టాలంటే 2,3,5,9 తేదీల్లో జాబ్​ లో జాయిన్ అయితే కెరీర్​ లో అత్యున్నత స్థాయిని చేరుకుంటారని పండితులు చెబుతున్నారు.

రాడిక్​ సంఖ్య2: మీ పుట్టిన తేదీ ప్రకారం 2 రాడిక్​ సంఖ్య ఉన్నవారు రు సున్నితమైన స్వభావంతో పాటు  సృజనాత్మకత కలిగి ఉంటారు. ఇలాంటి వారు ముఖ్యమైన పనులను 1,2,3,5 తేదీల్లోప్రారంభిస్తే అనుకున్న గోల్​ ను త్వరగా సాధిస్తారని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 

రాడిక్​ సంఖ్య3:  సంఖ్యాశాస్త్రం ప్రకారం.. రాడిక్​ సంఖ్య 3 అయితే ఇలాంటి వారు  జ్ఞానం, సలహాలు ఇవ్వడంలో దిట్టగా ఉంటారు. కొత్త పనిని ప్రారంభించాలంటే వీరు 1, 3, 5, 7, 9 తేదీల్లో చేయాలని నిపుణులు చెబుతున్నారు

రాడిక్​ సంఖ్య4:  న్యూమరాలజీ ప్రకారం.. రాడిక్స్ 4వ సంఖ్యతో సంబంధం ఉన్న వ్యక్తులు  భిన్నమైన ఆలోచనలు, పట్టుదల కలిగి ఉంటారు. వీరు వ్యాపారం ప్రారంభించాలన్నా.. జాబ్​ లో చేరాలన్నా.. 5, 6,8 తేదీలు బాగా కలసి వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

రాడిక్​ సంఖ్య5: రాడిక్​ సంఖ్య5 ఉన్నవారికి సంఖ్యా శాస్త్రం ప్రకారం  మంచి వాక్చాతుర్యం, వ్యాపార నైపుణ్యాలు కలిగి ఉంటారు.  ఇలాంటి వారు చేపట్టిన పనిలో రాణించాలంటే 1, 5,6 తేదీల్లో చేస్తే చాలా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. 

రాడిక్​ సంఖ్య6: ఏ నెలలో అయినా సరే 6, 15, 24 తేదీల్లో జన్మిస్తే వారికి రాడిక్​ సంఖ్య 6 అవుతుంది.  ఈ తేదీల్లో జన్మించిన వారు  అందం,శ్రేయస్సు ,  కళలను ఇష్టపడే అవకాశం ఉందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.  ఇలాంటి వారు 5, 6,8 తేదీల్లో కొత్త పనులు చేపడితే ఎలాంటి ఆటంకాలు జరిగిపోతాయని చెబుతున్నారు పండితులు.

రాడిక్​ సంఖ్య7: సంఖ్యా శాస్త్రం ప్రకారం 7, 16, 25 తేదీల్లో జన్మించిన వారికి రాడిక్​ నంబర్​ 7 అవుతుంది.  ఇలాంటి వారు ఏకాంతంగా ఉండేందుకు ఇష్టపడతారు.  రాడిక్​ సంఖ్య 7 ఉన్న వారు 1, 3, 5,7 తేదీల్లో కొత్త పనులు ప్రారంభించే ఇక వారికి తిరుగుండదు.  ఇక ఈ తేదీల్లో కొత్తగా జాబ్​ లో చేరితే  అధికారు ప్రశంశలతో పాటు అన్ని విధాలా బాగుంటుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

రాడిక్​ సంఖ్య8: సంఖ్యాశాస్త్రం ప్రకారం  8, 17, 26తేదీల్లో పుట్టిన వారికి రాడిక్​ సంఖ్య 8 అవుతుంది. వీరికి  కష్టపడే తత్వంతో  పాటు గంభీర స్వభావం కలిగి ఉంటారు. ఇలాంటి వారు 5, 6, 8 తేదీల్లో కొత్త పనిని ప్రారంభించాలని పండితులు చెబుతున్నారు. 

రాడిక్​ సంఖ్య9: నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారికి  రాడిక్​ సంఖ్య 9 అవుతుంది.  వీరు ధైర్యం, శక్తి, దూకుడు స్వభావం కలిగి ఉంటారు. వీరికి 1, 3, 5,9 తేదీలు కలిసి వస్తాయని పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని సంఖ్యా శాస్త్ర నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.