లిక్కర్ డ్రై డేలను ఎత్తేయండి..ప్రభుత్వానికి హోటళ్ల సంఘం రిక్వెస్ట్..!

లిక్కర్ డ్రై డేలను ఎత్తేయండి..ప్రభుత్వానికి హోటళ్ల సంఘం రిక్వెస్ట్..!

మన దేశంలో గాంధీ జయంతి స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవ రోజుల్లో, ఎన్నికల సమయంలో డ్రై డే ఉంటుందన్న సంగతి తెలిసిందే. ప్రాంతాన్ని బట్టి జరుపుకునే శోభాయాత్రలు, ఉత్సవాల సమయాల్లో కూడా డ్రై డే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆయా రోజుల్లో వైన్ షాప్స్ ఓపెన్ చేయరు. అయితే.. బెంగుళూరులో డ్రై డేలను ఎత్తేయాలని హోటళ్ల సంఘాలు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాయి. ఇదేమి వింత రిక్వెస్ట్ అనుకుంటున్నారా... అదేంటో ఇప్పుడు చూడండి...

కర్ణాటకలో శాసనమండలి స్థానాలకు ఎన్నికల సందర్భంగా తమకు రూ.500 కోట్లకు పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని.. ఎన్నికల సందర్భంగా జారీ చేసిన డ్రై డే ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని బెంగుళూరు హోటల్స్ ఆలోసియేషన్ కర్ణాటక ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది. ఈమేరకు సీఎం డీకే శివకుమార్ కు  ఓ లేఖ రాసింది బెంగుళూరు హోటల్స్ అసోసియేషన్. అక్టోబర్ 21న సాయంత్రం 4 గంటల నుండి అక్టోబర్ 23 వరకు, ఓట్ల లెక్కింపు జరిగే అక్టోబర్ 27న డ్రై డేగా ప్రకటించారని.. ఈ ఆంక్షలు ఎత్తేయాలని ప్రభుత్వాన్ని కోరింది అసోసియేషన్.

ఈ ఆంక్షల వల్ల బార్‌లు, రెస్టారెంట్లు, పబ్‌లకు భారీగా నష్టం వాటిల్లుతుందని... హోటల్ రంగంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ శాఖకు కూడా నష్టపోతుందని పేర్కొంది. ఈ ఎన్నికలు సుమారు 20వేల ఓటర్లు మాత్రమే ఉన్నారని.. దాదాపు 15వేలు మంది మహిళలు ఉన్నారని.. ఇంత తక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్న ఎన్నికల కోసం బెంగుళూరు అంతటా డ్రై డే ప్రకటించడం వల్ల మద్యం వ్యాపారులకు హోటళ్లకు ఇబ్బంది కలుగుతుందని పేర్కొంది అసోసియేషన్.

►ALSO READ | సీఈసీ, ఎన్నికల కమిషనర్ల నియామకంపై.. సుప్రీంకోర్టుకు ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్

కర్ణాటక శాసన మండలిలోని నాలుగు స్థానాలకు ( రెండు పట్టభద్రుల నియోజకవర్గాలు, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ) - ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలు అక్టోబర్ 23న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్నాయి. ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాలు: కర్ణాటక సౌత్-ఈస్ట్ గ్రాడ్యుయేట్స్, కర్ణాటక వెస్ట్ గ్రాడ్యుయేట్స్, కర్ణాటక నార్త్-ఈస్ట్ టీచర్స్, బెంగళూరు టీచర్స్.