సీఈసీ, ఎన్నికల కమిషనర్ల నియామకంపై.. సుప్రీంకోర్టుకు ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్

సీఈసీ, ఎన్నికల కమిషనర్ల నియామకంపై.. సుప్రీంకోర్టుకు ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) , ఎన్నికల కమిషనర్ల నియామకం, వారికి కల్పించిన జీవితకాల రక్షణకు (Lifelong Immunity) వ్యతిరేకంగా RJD రాజ్యసభ ఎంపీ మనోజ్ ఝా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన  చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల  నియామక చట్టం-2023 లోని సెక్షన్ 16ను సవాలు చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ చట్టం ద్వారా ఎన్నికల కమిషనర్లకు కల్పించిన పూర్తి రక్షణ రాజ్యాంగ విరుద్ధమని, ఇది  రాజ్యాంగాన్ని వంచించడమే అని మనోజ్ ఝా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 

జడ్జీలకు లేని రక్షణ..ఈసికి 

రాష్ట్రపతి, గవర్నర్లు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా లభించని జీవితకాల రక్షణను ఎన్నికల కమిషనర్లకు ఈ చట్టంలోని సెక్షన్ 16 ద్వారా కల్పిస్తోందని మనోజ్ కుమార్ పిటిషన్ లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ , రిటైర్డ్ జడ్జీలను కూడా తగిన అనుమతులతో ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉంటుందని, అయితే పదవీ విరమణ చేసిన ఎన్నికల కమిషనర్లపై ఎలాంటి క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకోకుండా ఈ చట్ట సవరణ ద్వారా శాశ్వత రక్షణ కల్పించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. 

►ALSO READ | 17 రాష్ట్రాల్లో యువ ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్..సరిదిద్దుకునే పనిలో ఎన్నికలసంఘం

అవినీతి, దురుద్దేశనిర్ణయాలు, నేరాలకు పాల్పడినా కూడా వారిపై చర్యలు తీసుకునేందుకు చట్టంలో ఏ అధికారికి అధికారం లేకుండా చేశారని ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు ఝా. ఈ చట్టం ద్వారా ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీ నుంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ (CJI)ని  తొలగించి, వారి స్థానంలో కేంద్ర మంత్రిని చేర్చడం ద్వారా ప్రభుత్వానికే పూర్తి మెజారిటీ లభించేలా చేశారని ఆరోపించారు. 

ఇదే చట్టంలోని సెక్షన్ 16 రూల్స్ పై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు ఇండియా కూటమి నేతల పిటిషన్లపై కూడా వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది.