సర్(SIR) ప్రక్రియపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సరిదిద్దుకునే పనిలో పడింది కేంద్ర ఎన్నికల సంఘం. గతంలో యువ ఓటర్ల నమోదుకు నిర్వహించాల్సిన స్పెషల్ సమ్మరీ రివిజన్ (SSR) ప్రక్రియను ఇప్పుడు నిర్వహించేందుకు సిద్దమైంది. 17 రాష్ట్రాల్లో ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల జాబితా సవరణ చేపట్టాలని ఆయా రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లకు లేఖ రాసింది. జనవరి 1, 2027 లోపు కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించింది.
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవాతో సహా సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులకు రాసిన లేఖలో 2027 జనవరి 1వరకు స్పెషల్ సమ్మరీ రివిజన్(SSR) ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఏంటీ సమ్మరీ రివిజన్(SSR)..?
స్పెషల్ సమ్మరీ రివిజన్(SSR) ను ప్రతియేటా కొత్త ఓటర్ల నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా కొత్త ఓటు హక్కుకు అర్హత పొందిన యువతకు మొదటి సారిగా ఓటే వేసేందుకు ఓటర్లుగా నమోదు అవకాశం కల్పిస్తారు. దీంతోపాటు ఇప్పటికే ఉన్న ఓటర్ల లిస్టులో తప్పులను సరిదిద్దడం, ఓటర్ల జాబితాలు ఖచ్చితంగా తాజాగా ఉండేలా చేయడం ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం.
SIR కి SSR కు ఏంటీ తేడా?..
ఎన్నికల సంఘం ప్రకారం.. స్పెషల్ సమ్మరీ రివిజన్ (SSR) లో కొత్త ఓటర్ల నమోదు, చిరునామా అప్డేట్, చనిపోయిన వారి ఓట్ల తొలగింపు వంటి ప్రక్రియకు ఓ ఫారం సమర్పించడం ద్వారా ఓటర్ లిస్టును అప్డేట్ చేస్తారు. అయితే SIR ప్రక్రియ ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఈ ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి ధృవీకరణ, ఎంట్రీల యొక్క వివరణాత్మక పరిశీలన, పెద్ద ఎత్తున డేటా ఆడిట్లు నిర్వహిస్తారు.
►ALSO READ | పనికిరాని సాకులు చెప్పొద్దు.. ఓట్ కౌంటింగ్ వీడియో ఎలా మిస్సయింది..?ఈసీపై సుప్రీంకోర్టు సీరియస్
ఉదాహరణకు, సమ్మరీ రివిజన్ (Summary Revision) కింద, ఇల్లు మారిన ఓటరు తమ చిరునామాను అప్డేట్ చేసేందుకు ఓ ఫారమ్ను దాఖలు చేయాల్సి ఉంటుంది. SIR లో బూత్ స్థాయి అధికారి ఆ చిరునామాకు వెళ్లి, ఓటరు అక్కడే నివసిస్తున్నారో లేదో నిర్ధారించుకుని, కొత్తగా ఎవరైనా అర్హత పొందారో లేదో తనిఖీ చేసి, భౌతిక ధృవీకరణ ఆధారంగా ఓటర్ల జాబితాను అప్డేట్ చేస్తారు.
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియ దేశవ్యాప్తంగా రాజకీయ వివాదాన్ని రేకెత్తించింది. ఓటరు లిస్టునుంచి అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తు్న్నారని ప్రతిపక్ష పార్టీలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
