భారత క్రికెట్ చరిత్రలోనే డ్రెస్సింగ్ రూమ్ ముచ్చట్లు ఎప్పుడూ అత్యంత ఆసక్తికరంగా ఉంటాయి. భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) హోస్ట్గా వ్యవహరిస్తున్న 'ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్ శర్మ' షో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సహచర ఆటగాళ్ల వ్యక్తిత్వాలపై హిట్మ్యాన్ చేసిన వ్యాఖ్యలు ఒకవైపు నవ్విస్తూనే, మరోవైపు భారత క్రికెట్లోని క్రమశిక్షణ, సీనియర్-జూనియర్ అనుబంధాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. ఇండియన్ ప్లేయర్స్ క్రికెటర్లు కాకపోయి ఉంటే ఏ ప్రొఫెషన్ సెలక్ట్ చేసుకునేవారనే ప్రశ్నకు రోహిత్ ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది.
జస్ప్రీత్ బుమ్రా డాక్టర్ అయ్యేవాడు:
బాలీవుడ్ స్టార్ కమెడియన్ కృష్ణ అభిషేక్ అడిగిన ప్రశ్నకు రోహిత్ శర్మ స్పందిస్తూ.. ప్రపంచ నంబర్ వన్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా గనుక క్రికెటర్ కాకపోతే ఖచ్చితంగా డాక్టర్ అయ్యేవాడని చెప్పాడు. మైదానంలో మ్యాచ్ చివర్లో చావు బతుకుల మధ్య పోరాడుతున్న సమయంలో, బౌలింగ్ కి వచ్చి ప్రత్యర్థి నుంచి మ్యాచ్ను కాపాడే ప్రాణదాతలా బుమ్రా నిలుస్తాడని కొనియాడాడు. ఆ ఒత్తిడిని జయించి మ్యాచ్ను గెలిపించడం అందరికీ సాధ్యమయ్యే పని కాదని హిట్ మ్యాన్ తేల్చి చెప్పాడు.
యంగ్ క్రికెటర్లని యువీ ఘోరంగా తిట్టేవాడు:
మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ను రోహిత్ శర్మ 'హెడ్మాస్టర్' తో పోల్చాడు. 2006, 2007 కాలంలో తాము కొత్తగా జట్టులోకి వచ్చినప్పుడు యువీ భాయ్ ఒక కఠినమైన హెడ్మాస్టర్లా వ్యవహరించేవాడని గుర్తు చేసుకున్నాడు. డ్రెస్సింగ్ రూమ్లో క్రమశిక్షణ విషయంలో జూనియర్లను బాగా తిట్టేవాడని, అయితే ఆ తిట్ల వెనుక ఎంతో ఆప్యాయత, ప్రేమ దాగి ఉండేవని పేర్కొన్నాడు. ఆరంభంలో సీనియర్లతో ఆడుతున్నప్పుడు ఉన్న భయం, బెరుకును పోగొట్టి, తమను పూర్తి కంఫర్టబుల్గా మార్చడంలో యువరాజ్ పాత్ర మరువలేనిదని రోహిత్ భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు.
►ALSO READ | బ్యాక్ టు బ్యాక్ గోల్డ్ మెడల్స్.. క్రికెటర్లతో ప్రధాని మోడీ ప్రత్యేక భేటీ
రిషభ్ పంత్ పిల్లల ప్లేట్లో ఫుడ్ లాక్కునేవాడు:
ఇక రిషభ్ పంత్ను రోహిత్ పర్ఫెక్ట్ 'బేబీ సిట్టర్' గా అభివర్ణించాడు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఆటగాళ్ల కుటుంబాలు, పిల్లలు మాతో వచ్చేవాళ్లని.. ప్రాక్టీస్ పూర్తయిన వెంటనే పంత్ పిల్లలతో గడిపేవాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అప్పటి కెప్టెన్ టిమ్ పైన్ 'బేబీ సిట్టర్' అని పిలవడానికి అసలు ముచ్చట ఇదే.. అయితే పిల్లలతో అంత ప్రేమగా ఆడుకుంటూనే, సరదాగా వారి ప్లేట్లలోని ఫుడ్ లాక్కుని తినేసేవాడని, దాంతో ఆ పిల్లలు రిషభ్ పంత్ ని చూసి చిరాకు పడేవారంటూ డ్రెస్సింగ్ రూమ్ ముచ్చట్లను రోహిత్ శర్మ నవ్వులు పూయిస్తూ పంచుకున్నాడు.
Yeh sab bhi game ka hissa hai😂 Dekhiye Family Full House with Rohit Sharma, Sat-Sun 9:30 baje, sirf #SonyEntertainmentTelevision aur Sony LIV par. #RohitSharma #FamilyFullHouse #SonyTV https://t.co/q5Gi6LcoEY
— sonytv (@SonyTV) October 15, 2026
