టాలీవుడ్లోకి మరో కొత్త హీరో అడుగుపెడుతున్నారు. అమెరికా నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్న కార్తీక్ జయంతి.. 'రాయవలస' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై గోపీ కృష్ణ జె నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎన్నారై దర్శకురాలు రాధిక జయంతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్, టీజర్తో ఆసక్తి పెంచిన ఈ సినిమా.. లేటెస్ట్ గా విడుదలైన 'రింగుడు రింగుడు' పాటతో మరింతగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
గ్రామీణ జీవితం, వాస్తవ సంఘటనల స్ఫూర్తితో 'రాయవలస'ను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో కార్తీక్ జయంతి సరసన శ్రీషా నులు కథానాయికగా నటిస్తున్నారు. ఆమె పోషిస్తున్న 'రాణి' పాత్ర సహజత్వం, హుందాతనంతో ప్రేక్షకులను ఆకట్టుకోనుందని చిత్ర బృందం భావిస్తోంది. కథలోని భావోద్వేగాలు, గ్రామీణ నేపథ్యం వెండితెరపై ఎలా ఆవిష్కృతమవుతాయన్న ఆసక్తి నెలకొంది.
►ALSO READ | నాగలోకం, వానర లోకం నేపథ్యంతో 'కరికాల'.. ముగ్గురు భామలతో సందీప్ కిషన్ మూవీ గ్రాండ్ లాంచ్!
అర్జున్ బాల సంగీతం అందించిన ఈ చిత్రానికి పూర్ణాచారి, కార్తీక్ జయంతి, తరుణ్ సైదుల్ సాహిత్యం అందించారు. రాహుల్ సిప్లిగంజ్, ధనుంజయ్, రమ్య బెహరా, సాహితి చాగంటి తదితర ప్రముఖ గాయకులు పాటలు ఆలపించారు. 'రింగుడు రింగుడు' పాటకు యూట్యూబ్లో వస్తున్న స్పందన సినిమాపై అంచనాలను పెంచుతోంది. అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవివర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
