యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్లోనే అత్యంత భారీ, ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటున్న పీరియాడిక్ 'కరికాల' గ్రాండ్ లాంచ్ అయింది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని దర్శకుడు యుగంధర్ ముని రెండు భాగాలుగా ఎంతో వైభవంగా తెరకెక్కిస్తున్నారు. గురువారం ( అక్టోబర్ 15, 2026 ) ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తపు పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి.
ఈ ఈవెంట్లో ముగ్గురు భామలు కేథరిన్ థ్రెసా, గాయత్రి భరద్వాజ్, సాక్షి మడోల్కర్ తమ గ్లామర్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజశేఖర్ తల్లి సత్యవతి గారు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మహిధర్ తల్లి పద్మారెడ్డి గారు క్లాప్ కొట్టారు. హీరో ఆది సాయి కుమార్ గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత వీరభద్రాచారి గారు స్క్రిప్ట్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. నా మిత్రుడు ఆది సాయి కుమార్ వల్లే నాకు ఈ టీమ్ పరిచయమైంది. దర్శకుడు యుగంధర్ చెప్పిన 'కరికాల' ప్రపంచం నన్ను మైమరిపించింది. నా కెరీర్లోనే ఇది బెస్ట్ మూవీ కాబోతోంది. శ్రీచరణ్ పాకాల అద్భుతమైన ఆల్బమ్ ఇస్తున్నారు అని ఆనందం వ్యక్తం చేశారు. సాక్షి, గాయత్రి, కేథరిన్‌లకు థాంక్స్ చెప్పారు.
►ALSO READ | Jailer 2: తలైవర్ కోసం ధనుష్.. ఐశ్వర్యతో కలిసి ఒకే థియేటర్‌కు.. అసలు ట్విస్ట్ ఇదే!
చందమామ కథలా నాగలోకం, వానర లోకం వంటి అందమైన ఊహా ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నామని దర్శకుడు యుగంధర్ ముని తెలిపారు. వచ్చే వారం నుంచే షూటింగ్ ప్రారంభమవుతుందిఅని ప్రకటించారు. ఫాంటసీ, అడ్వెంచర్ మాయాలోక నేపథ్యంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ చాప్టర్ 2027 జూలై 2న, సెకండ్ చాప్టర్ 2027 అక్టోబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నాయి. విజువల్ వండర్‌గా రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డు సృష్టిస్తుందో చూడాలి..
