ఈశాన్య రుతుపవనాల ఎంట్రీ..ఐదురోజులు తెలంగాణలో భారీ వర్షాలు!

ఈశాన్య రుతుపవనాల ఎంట్రీ..ఐదురోజులు తెలంగాణలో భారీ వర్షాలు!

తెలంగాణ ప్రజలు, రైతులకు  వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న ఐదు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. ఈశాన్య రుతుపవనాలు ఎంట్రీతో తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలకు కురుస్తాయని తెలిపింది. 

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో అక్టోబర్ 15 నుంచి 19 వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 

అక్టోబర్ 15, 16 తేదీల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు గంటకు 30నుంచి 40 కిలోమీటర్లవేగంతో ఈదురుగాలులతో  కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. 

అక్టోబర్ 17నుంచి 19 వరకు రెండు రోజులు  కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్‌కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

►ALSO READ | అందరి త్యాగాలు కొందరి భోగాలు..పార్లమెంటులో గళమెత్తిన ఎంపీలు..స్వరాష్ట్రమే లక్ష్యంగా ఎమ్మెల్యేల ఫోరం

మరోవైపు ఏపీలోకూడా భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అక్టోబరు 15 న అల్లూరి, కాకినాడ, విశాఖపట్నం, మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కృష్ణా, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఎల్ నినో ఎఫెక్ట్ తో నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూన్ నుంచి అక్టోబర్ వరకు కురువాల్సిన వానలు భారీగా తగ్గడంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న కమ్రంలో రైతన్నలకు కొంత మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ వర్షాల కారణంగా గత కొన్ని రోజులుగా పగటిపూట కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత నుండి ప్రజలకు ఉపశమనం లభించనుంది.